ETV Bharat / crime

అనకాపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి - accident news

road accident
రోడ్డు ప్రమాదం
author img

By

Published : Nov 27, 2022, 6:38 PM IST

Updated : Nov 27, 2022, 10:54 PM IST

18:35 November 27

రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ప్రమాదం

Three died in Road Accident: అనకాపల్లి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో ముగ్గురు మృతి చెందారు. విశాఖపట్నం నుంచి రాజమండ్రి వైపు అతి వేగంతో ప్రయాణిస్తూ కారు ద్విచక్ర వాహనంతో పాటు.. రోడ్డుపై వెళ్తున్న మరో ఇద్దరిపై దూసుకుపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఎలమంచిలి మండలం పిఎన్ఆర్ పేట గ్రామానికి చెందిన ఎడ్ల గోవిందరావు.. పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా పోలీసులను చూసి తన ద్విచక్ర వాహనాన్ని నడిపించుకుంటూ వెళ్తున్నాడు. ఈలోగా వెనుక నుంచి వచ్చిన కారు గోవిందరావు పైనుంచి దూసుకెళ్లింది. అంతేకాకుండా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న అన్నాచెల్లెలును ఢీకొట్టింది. ఈ ఘటనలో పిఎన్ఆర్ పేట గ్రామానికి చెందిన ఎడ్ల గోవిందరావుతో పాటు.. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం జగపతినగరం గ్రామానికి చెందిన మొల్లేటి శివాజీ, బీసెట్టి కుమారి అక్కడికక్కడే మృతి చెందారు.

ఢీకొట్టిన కారులో ఉన్న వారిని అప్పగించాలని,.. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని కోరుతూ పిఎన్ఆర్ పేట గ్రామస్థులు జాతీయ రహదారిపై బైఠాయించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.

ఇవీ చదవండి:

Last Updated : Nov 27, 2022, 10:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.