ETV Bharat / crime

Rape attempt: బాలికపై జీహెచ్​ఎంసీ ఉద్యోగి అత్యాచారయత్నం

తన కుమార్తెపై జీహెచ్​ఎంసీ ఔట్​సోర్సింగ్​ ఉద్యోగి భాస్కరరావు అత్యాచారానికి(rape attempt) యత్నించాడంటూ మేడ్చల్​ జిల్లా జగద్గిగిగుట్ట పోలీసులకు ఓ మహిళ ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్​ చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.

Rape case
Rape case
author img

By

Published : May 28, 2021, 9:38 AM IST

బాలికపై జీహెచ్​ఎంసీ ఉద్యోగి అత్యాచారయత్నం

బాలికపై అత్యాచారానికి యత్నించిన జీహెచ్​ఎంసీ ఔట్​ సోర్సింగ్​ ఉద్యోగిని పోలీసులు అరెస్ట్​ చేశారు. బాధితురాలి తల్లిని తప్పుదోవ పట్టించి.. ఈ ఘాతుకానికి యత్నించాడు. మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లా​ జగద్గిరిగుట్ట పీఎస్​ పరిధి మహదేవపురంలో ఉన్న జంతు సంరక్షణ కేంద్రం(animal care center) షెల్టర్​ మేనేజర్​గా (ఒప్పంద ప్రాతిపదికన) భాస్కర్​రావు పనిచేస్తున్నాడు. కుటుంబ సభ్యులతో కలిసి సంరక్షణ కేంద్రంలోనే నివాసం ఉంటున్నాడు. ఆ కేంద్రానికి కాపాలాదారుగా పనిచేస్తున్న మహిళ తన కుమార్తెతో కలిసి అక్కడే ఉంటోంది. అక్కడే జంతువుల బాగోగులు చూసే వ్యక్తిగా తరుణ్​ పనిచేస్తున్నాడు. తరుణ, కాపాలాదారు మహిళ నివాసానికి కామన్​ బాత్రూమ్​ ఉంది.

ఈ ఉదయం బాలిక తల్లిని.. వేరే పని పురమాయించాడు షెల్టర్ మేనేజర్​​ భాస్కరరావు. ముందస్తు పథకం ప్రకారం.. బాత్రూమ్​లో దాక్కున్నాడు. బాలిక బాత్రూమ్​లోకి వెళ్లగానే ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. ఒక్కసారి షాక్​కు గురైన బాలిక కేకలు వేస్తూ బయటకు వచ్చింది. వెంటనే ఈ విషయాన్ని తల్లికి చెప్పింది. భాస్కరరావుపై ఫిర్యాదుచేసేందుకు తల్లీ కుమార్తె జగద్గిరిగుట్ట పోలీస్​ స్టేషన్​ వెళ్లిన సమయంతో నిందితుడు బెదిరింపులకు పాల్పడినట్లు బాధితులు ఆరోపించారు. బాధితులకు న్యాయం చేయాలంటూ తోటి ఉద్యోగాలు పోలీస్​ స్టేషన్​కు చేరుకున్నారు.

అప్రమత్తమైన పోలీసులు.. ఈ ఘటనపై కేసు నమోదుచేసి (rape case filed) నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు ప్రారంభించారు.

ఇవీచూడండి:

భర్తకు అనారోగ్యం.. తోపుడుబండితో భార్య అవస్థలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.