కడప జిల్లా రాజంపేటలో మట్కా స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఎనిమిది మంది వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.2.04 లక్షలు, ఏడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సీఐ నరేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. మట్కా కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని సీఐ నరేంద్ర అన్నారు. మట్కా స్థావరాలు నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
ఇదీ చదవండి: 2023 మార్చి నాటికి అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ కనెక్షన్: సీఎం జగన్