Tickets Fraud in Tirumala: తిరుమలలో సుపథం టికెట్లను సేవా టికెట్లుగా విక్రయించిన కరుణాకర్ అనే వ్యక్తిని తితిదే విజిలెన్సు సిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కాణిపాకం ఏఈవో మాధవరెడ్డి లేఖతో 12 టికెట్లు పొందిన కరుణాకర్.. వాటిని కర్ణాటకకు చెందిన భక్తులకు రూ.32 వేలకు విక్రయించినట్లు తిరుమల ఏఎస్పీ మునిరామయ్య తెలిపారు. తితిదే విజిలెన్స్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరుణాకర్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కాణిపాకం ఏఈవో మాధవరెడ్డిని ప్రశ్నిస్తున్నట్లు పేర్కొన్నారు. కాణిపాకం దేవస్థానంలో గ్యాస్ టెక్నిషియన్‌గా కరుణాకర్ పని చేస్తున్నట్లు వెల్లడించారు.
కరుణాకర్ కాణిపాకం దేవాలయంలో గ్యాస్ టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు. ఆలయ ఏఈవో సహాయంతో 12 సుపథం టికెట్లు పొంది.. వాటిని కర్ణాటకకు చెందిన భక్తులకు రూ.32వేలకు విక్రయించాడు. తితిదే సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. కాణిపాకం ఏఈవోని విచారిస్తున్నాము.-తిరుమల ఏఎస్పీ మునిరామయ్య
ఇవీ చదవండి: