ETV Bharat / crime

Drug addiction : మీ పిల్లలు డ్రగ్స్ వాడుతున్నారా..? ఇలా తెలుసుకోండి - drug addiction

అదో సరికొత్త మత్తు..! ఆ జగత్తులో ప్రవేశించిన వారు విశ్వాన్ని పాలించే చక్రవర్తిలా ఫీలైపోతారు..! ఆ మత్తులో ఉన్నంత సేపూ.. నేనే రాజు.. నేనే మంత్రి అన్నట్టుగా రెచ్చిపోతారు..! ఇల్లు, ఒళ్లు గుల్ల గుల్ల అయ్యే వరకూ.. అనర్థాన్ని గుర్తించలేరు. అర్థం చేసుకున్న తర్వాత కూడా.. దాన్ని వదల్లేని స్థితికి చేరుకుంటారు. ఇంతటి ఉపద్రవం వైపు మొదటి అడుగు ఎలా పడుతుందంటే.. "ఓసారి టేస్ట్ చూద్దాం.." అంటూ మొదలవుతుంది. మరి, మీ పిల్లలు ఎన్నిసార్లు టేస్ట్ చేశారో తెలుసుకోండి.

Drug addiction
Drug addiction
author img

By

Published : Oct 11, 2021, 11:53 AM IST

Updated : Oct 11, 2021, 12:24 PM IST

యువత మత్తు(Drug addiction) వలయంలో కూరుకుపోతోంది. సరదాగా సిగరెట్లు, మద్యంతో మొదలైన వ్యసనం మాదకద్రవ్యాలుకూ(Drug addiction) విస్తరిస్తోంది. గంజాయి దమ్ము కొడితే ఎలా ఉంటుందో చూడాలనే ఉత్సాహం(నావల్టీ కికింగ్‌)తోనే ఎక్కువ మంది ఈ రొంపిలోకి దిగుతున్నారు. స్నేహితుల జన్మదిన వేడుకల్లో, వారాంతపు పార్టీల్లో గంజాయి సేవనం(cannabis) సాధారణమైపోయింది. ఆ తర్వాత గోవాలాంటి ప్రాంతాల్లో దొరికే ఎల్‌ఎస్‌డీ బ్లాట్స్‌కు అలవాటు పడుతున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా డ్రగ్స్‌(Drug addiction) కోసం రహస్య సంకేత పదాలతో సంభాషణలు సాగిస్తున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల్లో తొలిదశలో వ్యసనాన్ని గుర్తించి కౌన్సెలింగ్‌ ఇప్పిస్తే సత్ఫలితాలుంటాయని అమృత ఫౌండేషన్‌ వ్యవస్థాపకురాలు దేవికారాణి చెబుతున్నారు.

గుర్తించడం ఇలా..
విద్యార్థుల బ్యాగులలో లైటర్‌, ఐడ్రాప్స్‌, ఒసీబీ పేపర్‌ లాంటివి గమనిస్తే అనుమానించాలి. స్నేహితులతో టెర్రస్‌పై ఎక్కువ సమయం గడుపుతుంటే ఏంచేస్తున్నారో కనిపెట్టాలి.

ఇంటికి దూరంగా ప్రైవేటు గదుల్లో, వసతిగృహాల్లో ఉంటే ఆకస్మికంగా సందర్శించి పరిస్థితుల్ని గమనించాలి. తరచూ కళాశాల యాజమాన్యంతో విద్యార్థి ప్రవర్తనపై ఆరా తీయాలి.

మాదకద్రవ్యాలు వినియోగించడం నేరమని చెప్పాలి. ఏడాది వరకు కఠిన కారాగార శిక్ష లేదా రూ.20 వేల వరకు జరిమానా లేదా రెండూ విధించే అవకాశముంటుందని అవగాహన కల్పించాలి. సరఫరా చేస్తూ దొరికితే 10-20 ఏళ్ల శిక్ష పడుతుందని స్పష్టం చేయాలి.

నషాముక్త్‌ భారత్‌తో అవగాహన..
మద్యం, మాదకద్రవ్యాల(Drug addiction) బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతున్నా విముక్తి కేంద్రాలు పెరగడం లేదు. తెలంగాణలో ఎర్రగడ్డ ప్రభుత్వ మానసిక వైద్యశాలలో మాత్రమే చికిత్స అందిస్తున్నారు. ఇటీవల కేంద్రం ‘నషాముక్త్‌ భారత్‌ అభియాన్‌(Nasha Mukt Bharat Abhiyan)’ పేరిట రాష్ట్రంలో అయిదుగురు స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులకు శిక్షణ ఇచ్చింది. వారి ద్వారా పాఠశాలల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.

...
  • ఇదీ చదవండి :

ఇద్దరు పిల్లలకు విషమిచ్చి చంపేసిన తల్లి.. కారణమేంటంటే..?

Last Updated : Oct 11, 2021, 12:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.