ETV Bharat / crime

స్కాట్లాండ్​లో కుమారుడు మృతి, మృతదేహం కోసం తల్లిదండ్రుల ఎదురుచూపు

Parents waiting for sons deadbody చేతికందొచ్చిన కొడుకుని రోడ్డు ప్రమాదం బలి తీసుకుంది. విదేశాలకు వెళ్లి ప్రయోజకుడవుతాడనుకున్న ఆ తల్లిదండ్రులకు కన్నీరే మిగిలింది. కుమారుడు వృద్ధిలోకి వచ్చాడనే వార్త విందామనుకున్న వారికి అతడు లేడు, ఇకరాడనే విషయం వినాల్సి వచ్చింది. కనీసం కొడుకు మృతదేహాన్ని చూద్దామనుకున్న వారికీ ఎదురుచూపులే మిగిలాయి. స్కాట్లాండ్​లో మరణించిన కుమారుడి డెడ్​బాడీని వెంటనే తీసుకురావాలని ఆ తల్లిదండ్రులు కోరుతున్నారు.

parents await for son dead body
parents await for son dead body
author img

By

Published : Aug 24, 2022, 9:14 PM IST

youngstar died in scotland: చిత్తూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఎరోనాటికల్​ ఇంజనీరింగ్​లో మాస్టర్స్​ కోసం విదేశాలకు వెళ్లిన గంగవరం మండలం కీలపట్ల గ్రామానికి చెందిన గిరీష్​ కుమార్​ ఈ నెల 19వ తేదీన స్కాట్లాండ్​లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ప్రమాదం జరిగి ఇన్ని రోజులవుతున్నా మృతదేహాన్ని తమకు అప్పగించలేదని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. మృతదేహాన్ని ఇండియాకు తీసుకువచ్చేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నామని కన్నీటి పర్యంతమవుతున్నారు. స్కాట్లాండ్​ ప్రభుత్వం ఐదు రోజుల్లో డెడ్​ బాడీని అప్పజెప్పుతామని చెప్పి.. ఇంతవరకు పంపలేదని వారు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.