ETV Bharat / crime

Gas Cylinder Blast: ప్రమాదవశాత్తు పేలిన గ్యాస్ సిలిండర్.. వృద్ధుడికి తీవ్రగాయాలు - ఆంధ్రప్రదేశ్​ తాజా వార్తలు

cylinder blast: అనంతపురం జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. కుందుర్పి మండలంలోని బెస్తరపల్లిలో చెన్నారాయప్ప అనే వ్యక్తి ఇంట్లో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో వృద్ధుడికి తీవ్ర గాయాలయ్యాయి.

gas cylinder blast
ప్రమాదవశాత్తు పేలిన గ్యాస్ సిలిండర్
author img

By

Published : Feb 11, 2022, 12:13 PM IST

gas cylinder blast: అనంతపురం జిల్లా కుందుర్పి మండలం బెస్తరపల్లిలో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఇల్లు పూర్తిగా నేలమట్టమైంది. ప్రమాదంలో ఇంటి యజమాని చెన్నరాయప్పకు తీవ్రగాయాలు అయ్యాయి. ఇంటిలో గ్యాస్ లీక్ అయ్యిందని.. ఇల్లు మొత్తం గ్యాస్​తో నిండిన విషయం తెలియక చెన్నారాయప్ప స్టవ్​ వెలిగించడంతోనే ప్రమాదం జరిగిందని గ్రామస్తులు చెబుతున్నారు.

ఇంట్లో ఇరుక్కుపోయిన వృద్ధుడిని స్థానికులు బయటకు తీసుకువచ్చి, ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇంట్లో మిగిలిన కుటుంబ సభ్యులంతా కర్ణాటకలోని తుమకూరులో ఓ పెళ్లి కార్యక్రమానికి వెళ్లారని గ్రామస్థులు తెలిపారు. మూడు నెలల క్రితం కొత్తగా నిర్మించిన ఇంటిలో చెన్నరాయప్ప కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్నారు.

ఇదీ చదవండి:

Woman Suicide: రైలుకింద పడి తల్లీ బిడ్డల ఆత్మహత్య.. కారణం ఇదే..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.