Saroornagar Honor Killing Case: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సరూర్‌నగర్ పరువు హత్య కేసులో నిందితుల కస్టడీ ముగిసింది. ఇద్దరు ప్రధాన నిందితులను 5 రోజుల కస్టడీకి ఎల్బీనగర్ కోర్టు అంగీకరించగా.. చర్లపల్లి జైలులో ఉన్న మొబిన్, అహ్మద్‌లను పోలీసులు ప్రశ్నించారు. నిందితుల నుంచి కీలక సమాచారం సేరించారు. నాగరాజు హత్యలో ఇద్దరి ప్రమేయం మాత్రమే ఉన్నట్లు పోలీసులు తేల్చారు. తన చెల్లిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని మొబిన్, అతని బావ కలిసి హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. నాగరాజు కదలికలను తెలుసుకునేందుకు మొబైల్ ట్రాకర్ అప్లికేషన్‌ను ఉపయోగించారన్న అనుమానం నిజమైనట్టు తెలిపారు. కస్టడీ ముగియడంతో నిందితులను ఎల్బీనగర్ కోర్టులో హాజరుపర్చారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు ఇద్దరు నిందితులను చర్లపల్లి జైలుకు తరలించారు.
"ఇద్దరు నిందితుల కాల్‌డేటాను పరిశీలించాం. ఘటన జరిగిన రోజు నిందితులు.. కుటుంబసభ్యులతో తప్ప వేరెవ్వరితో మాట్లాడలేదు. మొబిన్ తన జీమెయిల్‌కు పాస్‌వర్డ్‌గా చరవాణి నెంబర్ పెట్టుకున్నాడు. నాగరాజు కూడా జీమెయిల్‌కు చరవాణి నెంబరే పాస్వర్డ్ పెట్టి ఉండొచ్చని అంచనా వేసి.. ప్రయత్నించాడు. చరవాణి నెంబర్ టైప్ చేసి మొబిన్ సఫలమయ్యాడు. జీమెయిల్లోకి వెళ్లి... ఫైండ్ మై డివైస్(Find my Device) అనే ఆఫ్షన్ ఎంచుకున్నాడు. దీని సాయంతో నాగరాజు కదలికలను మొబిన్ తెలుసుకున్నాడు. ఈ నెల 4న పథకం ప్రకారం మాటు వేసిన మొబిన్, అహ్మద్ కలిసి నాగరాజును హత్య చేశారు. ఇద్దరు నిందితులకు ఏ సంస్థతోనూ సంబంధాలు లేవు." - పోలీసులు
ఇవీ చూడండి: