తెలంగాణలోని కరీంనగర్-హైదరాబాద్ రాజీవ్‌రహదారిలో రేణిగుంట టోల్ ప్లాజా వద్ద ప్రమాదం చోటు చేసుకొంది. టోల్‌ప్లాజా వద్ద పైకప్పును విస్తరించేందుకు భారీ క్రేన్ సహాయంతో మరమ్మతులు చేస్తుండగా... హైదరాబాద్ వైపు నుంచి ఓ లారీ అతివేగంతో దూసుకువచ్చింది. లారీ ఢీకొనటం వల్ల క్రేన్ ముందుకు కదిలి... దానిపైన పనిచేస్తున్న ఇద్దరు కార్మికులు కింద పడి తీవ్రగాయాల పాలయ్యారు. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో నమోదు అయ్యాయి.
గాయపడిన ఇద్దరు క్షతగాత్రులను హుటాహుటిన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు. అక్కడ జరుగుతున్న పనిని లారీ డ్రైవర్ గమనించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందా... లేదా నిర్లక్ష్యం వల్లే జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.