Narcotics in Tarnaka: తెలంగాణలోని సికింద్రాబాద్ తార్నాకలో నార్కోటిక్ అధికారుల సోదాలు నిర్వహించారు. మత్తుపదార్థాలు క్రయవిక్రయాలు చేస్తున్న 11 మందిని అరెస్టు చేశారు. 9 మంది డ్రగ్ వినియోగదారులు, ఇద్దరు అమ్మకందారులు అరెస్టయ్యారు. నిందితులను అరెస్టు చేసిన నార్కోటిక్, ఓయూ పోలీసు బృందం.. వారి నుంచి గంజాయి, హాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు.
Banjarahills Drugs Case: ఇటీవల తెలంగాణలోని బంజారాహిల్స్ రాడిసన్ బ్లూ ప్లాజాలోని పుడింగ్ అండ్ మింక్ పబ్ చీకటి కోణాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. సినీ, రాజకీయ, వ్యాపార వర్గాలకు చెందిన కుటుంబాల్లోని యువతను ఆకట్టుకునే లక్ష్యంతో నిర్వాహకులు యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘించినట్టు, హోటల్ బార్‌కు ఉన్న 24 గంటల అనుమతిని చూపుతూ వ్యవహారం నడిపించినట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. పబ్‌లో జరిగే వ్యవహారం బయటకు పొక్కకుండా నిర్వాహకులు పకడ్బందీ ఏర్పాట్లు చేసుకున్నారు. పుడింగ్ అండ్ మింక్ పేరుతోనే ‘పామ్’ అనే యాప్‌ను రూపొందించారు. యాప్‌లో పేరు నమోదుకు రిజిస్ట్రేషన్ ఫీజుగా ఒక్కొక్కరి నుంచి రూ.50,000 వసూలు చేశారు. ‘పగలు, రాత్రి అనే తేడాలేకుండా ఎప్పుడైనా పబ్‌కు రావచ్చు. ఇష్టమైనంత సమయం ఉండొచ్చు. ఆనందాలను ఆస్వాదించవచ్చంటూ పబ్ నిర్వాహకులు యాప్‌లోని సభ్యులను ఆహ్వానించేవారు. పోలీసులు పబ్‌వైపు కన్నెత్తి చూడరంటూ భరోసానిచ్చేవారు. అలా ఆకర్షించే క్రమంలోనే మాదకద్రవ్యాలనూ వినియోగదారులకు రుచిచూపినట్టు’ దర్యాప్తులో తేలినట్టు తెలుస్తోంది. యాప్‌లో 250 మంది సభ్యులున్నట్టు నిర్ధారణకు వచ్చిన దర్యాప్తు అధికారులు.. ఆదివారం తెల్లవారుజామున పబ్‌లో అదుపులోకి తీసుకున్న 148 మందిలో ఎవరెవరు ఈ యాప్‌లో పేర్లను నమోదు చేసుకున్నారనే కోణంలో ఆరా తీస్తున్నారు.
ఇదీ చదవండి:
ABV Comments: 'తన గౌరవానికి భంగం కలిగించేలా ఆరోపణలు చేస్తే స్పందించకూడదా'