ETV Bharat / crime

Dead body in Water tank: వాటర్​ ట్యాంకులో మృతదేహం..వారం రోజులుగా అవే నీటిని.. - dead body found in musheerabad

Dead body in Water tank: హైదరాబాద్‌ ముషీరాబాద్‌ పరిధిలోని వాటర్‌ ట్యాంకులో మృతదేహం లభ్యమైంది. దీనిపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా నీటి నుంచి దుర్వాసన వస్తోందని.. అప్పడప్పుడూ వెంట్రుకలు, చిన్న చిన్న మాంసం ముద్దలు వచ్చేవని స్థానికులు చెబుతున్నారు.

వాటర్​ ట్యాంకులో మృతదేహం
వాటర్​ ట్యాంకులో మృతదేహం
author img

By

Published : Dec 7, 2021, 10:31 PM IST

వాటర్​ ట్యాంకులో మృతదేహం

Dead body in Water tank: హైదరాబాద్‌ ముషీరాబాద్‌ పరిధిలోని వాటర్‌ ట్యాంకులో మృతదేహం లభ్యమవడం కలకలం రేపింది. ట్యాంకు శుభ్రపరచడానికి వెళ్లిన జలమండలి సిబ్బంది కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. క్లూస్​టీం, డీఆర్​ఎఫ్​ బృందాలతో ఘటనాస్థలికి వెళ్లిన పోలీసులు.. మృతదేహాన్ని బయటకు తీయించారు. వ్యక్తి మృతి, ఇతర అంశాలపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహం దొరికిన ట్యాంక్​లోని నీటినే వారం రోజులుగా స్థానికులు తాగుతున్నట్లు తెలుస్తోంది. 25 ఏళ్ల యువకుడి మృతదేహంగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ట్యాంక్​ నీరు నాలుగు బస్తీలకు వెళ్తుందని స్థానిక కార్పొరేటర్​ తెలిపారు. శివస్థాన్​పూర్​, హరినగర్​, పద్మశాలి కాలనీ సహా మరో బస్తీకి ఈ నీరు వెళ్తుందని చెప్పారు. ఈ ఘటనతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ వారంలో ఓ ఇంట్లో.. నీట్లో నుంచి వెంట్రుకలు, మాంసం ముద్దలు వస్తున్నాయని ఫిర్యాదు వచ్చినట్లు తెలిపారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.

ట్యాంక్​ చాలా పాతకాలం నాటిదని.. శిథిలావస్థకు చేరుకుందన్నారు. సుమారు 50 శాతం నీరు లీకేజీ అవుతుంటుందని చెప్పారు. అప్పుడప్పుడూ పెచ్చులూడిపడుతూ ఉంటుందని.. గతంలో జీహెచ్​ఎంసీ కమిషనర్​గా ఉన్న దానకిషోర్​, ఎమ్మెల్యే ముఠాగోపాల్​ దృష్టికి ఈ సమస్యలను తీసుకెళ్లినట్లు స్థానికులు చెప్పారు.

గత కొద్ది రోజులుగా నీటి నుంచి దుర్వాసన వస్తోందని స్థానికులు తెలిపారు. చిన్నారులకు ఇదే నీటిని తాగించామని.. వేడి చేసుకొని తాగినా దుర్వాసన వచ్చేదని చెప్పారు.

ఇవీచూడండి: woman bathing secretary record : స్నానాల గదిలో ఉన్న మహిళ వీడియో తీసిన టెక్నీషియన్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.