ETV Bharat / crime

పెళ్లి పేరుతో యువతులకు ఎర.. చిక్కారో కోట్లు స్వాహా..! - గుంటూరు నేర వార్తలు

YOUNG MAN CHEATS A YOUNG WOMAN : ఒకప్పుడు యువతీ యువకులకు పెళ్లి చేయాలంటే అందరికీ గుర్తు వచ్చేది పెళ్లిళ్ల పేరయ్య. ఆయనకు ఫొటోలు ఇచ్చి ఏమైనా సంబంధాలు ఉంటే చూడమని చెప్పేవారు. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా సామాన్యుల అలవాట్లలో కూడా మార్పులు వస్తున్నాయి. పెళ్లిళ్ల పేరయ్యలను సంప్రదించడం మానేసి మ్యాట్రిమొనీల్లో వెతుకుతున్నారు. ఇప్పుడు వాటిని కూడా వాళ్ల అవసరాలకు వాడుకుని ఆ తర్వాత మోసం చేస్తున్నారు. ఇలాంటి ఓ కేటుగాడి బాగోతాన్ని పోలీసులు బయటపెట్టారు.

guntur police arrested the cheating accuse

author img

By

Published : Jan 17, 2023, 12:30 PM IST

YOUNG MAN CHEATS A YOUNG WOMAN : ప్రస్తుత కాలంలో ఎవరికైనా పెళ్లిళ్లు చేయాలి అనగానే అందరికీ ఠక్కున గుర్తొచ్చేది మ్యాట్రిమొనీ సంస్థలు. ఎక్కడెక్కడో వెతకడం ఎందుకనుకునే వాళ్లందరూ వీటినే ఎంచుకుంటారు. అందులో మనకు నచ్చిన, మనం మెచ్చిన వారిని సెలెక్ట్​ చేసుకుని వారిని జీవిత భాగస్వామ్యులుగా ఎంచుకోవచ్చు. అయితే తాజాగా కొందరు మోసగాళ్లు వాటిని అలుసుగా చేసుకుని వారి అవసరాలను అలవోకగా తీర్చుకుంటున్నారు.

మ్యాట్రిమొనీలో అందమైన ఫొటోలు పెట్టి, తనకు రూ. 100 కోట్ల ఆస్తి ఉందని యువతులను నమ్మించి పెళ్లి పేరుతో మోసగిస్తున్న ఓ కేటుగాడిని గుంటూరు పోలీసులు పట్టుకున్నారు. రూ.లక్షలు దోచేసి విమానం ఎక్కి దేశాన్ని దాటే క్రమంలో జిల్లా ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌ చొరవతో పోలీసు బృందాలు అరెస్టు చేశాయి. సేకరించిన సమాచారం ప్రకారం.. గుంటూరుకు చెందిన ఓ యువతి లండన్‌లో సాఫ్ట్‌వేర్‌ కొలువు చేస్తోంది. ఆమెకు వివాహం చేయాలని తల్లి ప్రయత్నాలు చేస్తోంది. విషయం తెలిసిన హైదరాబాద్‌కు చెందిన ఈ యువకుడు తాను పెళ్లి చేసుకుంటానని ఆస్తి, జీతంపై మాయమాటలు చెప్పాడు.

గుంటూరులో ఇల్లు కొనేందుకు రూ. కోటి పంపుతానన్నాడు. అయితే తన అకౌంట్లో డబ్బుల ఇబ్బంది ఉందని నమ్మించి.. తమ మధ్య బ్యాంకు లావాదేవీలు జరగాలని చెప్పాడు. అలా విడతల వారీగా రూ.25 లక్షలు జమ చేయించుకున్నాడు. ఇల్లు కొనే ప్రక్రియలో భాగంగా యజమాని డబ్బులు అడిగారు. ఒక్కసారిగా రూ .కోటి ఇవ్వకూడదని, ముందు తన ఖాతాలోకి రూ. 2 లక్షలు పంపాలనగా అందరికీ అనుమానం వచ్చింది. పోలీసులకు విషయం చేరడంతో నిందితుడిని గాలించి పట్టుకున్నారు. ఈ మోసగాడు ఇదే తరహాలో 20 రోజుల కిందట విశాఖలో ఓ వైద్యురాలిని పెళ్లి చేసుకొని.. మళ్లీ పెళ్లికి సిద్ధమయ్యాడని పోలీసులు తెలిపారు.

ఎవరైనా తెలియని వ్యక్తులు డబ్బులు ఇస్తామని లేకుంటే ఇవ్వమని అడిగితే మోసపోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. ఇటువంటి వాటికి సంబంధించిన ఫోన్​ కాల్స్​ లేదా మెసేజ్​లు వస్తే తమకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. సైబర్​ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఎటువంటి అనుమానాలు ఉన్న సైబర్​ క్రైమ్​ పోలీసులను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.