FIRE ACCIDENT: తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులోని జీఎల్ఆర్ షాపింగ్మాల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. అర్ధరాత్రి అకస్మాత్తుగా చెలరేగిన మంటలతో దుకాణంలో ఉన్న వస్త్రాలు, ఫర్నిచర్ కాలి బూడిదయ్యాయి. వస్త్ర దుకాణానికి విద్యుత్ సాయంతో తెరుచుకునే ద్వారం ఏర్పాటు చేయడం వల్ల షాట్‌సర్క్యూట్ జరిగిందని భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో.. షాపు ద్వారాలు తెరుచుకోవడం ఆలస్యమవ్వడంతో.. జేసీబీని ఉపయోగించి తెరిచారు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. సుమారు కోటి రూపాయలకు పైగా ఆస్తి నష్టం జరిగిందని అగ్నిమాపక సిబ్బంది అంచనా వేస్తున్నారు.
ఇవీ చదవండి: