Father raped minor daughter: కన్నకూతురిపై తండ్రి అఘాయిత్యానికి పాల్పడిన దారుణ సంఘటన.. బంజారాహిల్స్ ఠాణా పరిధిలో చోటుచేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ ప్రాంతంలో నివసించే ఆటోడ్రైవరుకు ఒక కూతురు, ఇద్దరు కుమారులు. అతని భార్యకు కొన్నాళ్లుగా ఆరోగ్యం బాగా లేదు. దీంతో కొద్దిరోజుల క్రితం ఆమె పుట్టింటికి వెళ్లింది. తనతో పిల్లలను కూడా తీసుకెళ్లాలని భావించినప్పటికీ.. వారిని తనవద్దనే ఉంచుకుంటానని చెప్పాడు భర్త.
దీంతో.. ఆమె మాత్రమే పుట్టింటికి వెళ్లింది. ఈ క్రమంలో.. ఈనెల 9న అర్ధరాత్రి దాటిన తరువాత కుమార్తె(15)పై తండ్రి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నోరు నొక్కి రెండుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని మరుసటి రోజున తన సోదరుడికి తెలియజేసింది బాధితురాలు.
ఇద్దరూ కలిసి మహబూబ్‌నగర్‌లో ఉన్న తల్లి వద్దకు వెళ్లారు. జరిగిన విషయాన్ని చెప్పి రోదించారు. దీంతో.. శుక్రవారం నగరానికి వచ్చిన తల్లి.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు దారుణ అఘాయిత్యానికి పాల్పడ్డాడని అభియోగం ఎదుర్కొంటున్న తండ్రిపై.. ఐపీసీ సెక్షన్లతోపాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు. అనంతరం నిందితుడిని అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు.
ఇదీ చదవండి: Illegal Affair Killed Son: ప్రేమ పెళ్లి.. వివాహేతర సంబంధం.. చివరికి అడ్డువచ్చిన వారిని..!