ETV Bharat / crime

నకిలీ ప్రొఫైల్‌ ఖాతాలతో  సైబర్‌ నేరగాళ్ల మోసాలు - ఏపీలో సైబర్​ క్రైమ్

నకిలీ ప్రొఫైల్‌ ఖాతాలతో  సైబర్‌ నేరగాళ్ల మోసాలకు పాల్పడుతున్నారు. గతంలో ప్రముఖులే లక్ష్యం సైబర్ కేటుగాళ్లు పన్నాగం రచించారు. తాజా సామాన్యులనే టార్గెట్​ చేస్తున్నారు. సామాన్యుల పేరిట నకిలీ ఖాతాలు తెరిచి.. వారి కాంటాక్ట్ లో ఉన్న స్నేహితులకు రిక్వెస్టులు పెడతారు. వాటిని అనుమతించిన కొద్దిసేపటికే.. మాటలు కలిపి డబ్బులు గుంజే ప్రయత్నం చేస్తారు.

cyber criminal creating Facebook fake accounts and asking money

author img

By

Published : Mar 14, 2021, 10:17 AM IST

అచ్చం అసలైన ప్రొఫైల్‌ను పోలినట్టే ఫేస్‌బుక్‌లో నకిలీ ఖాతా సృష్టిస్తారు. ఆ వ్యక్తి స్నేహితుల జాబితాలోని వారందరికీ మళ్లీ కొత్తగా ఫ్రెండ్‌ రెక్వెస్టులు పంపిస్తారు. వాటిని అనుమతించిన కొద్దిసేపటికే మెసెంజర్‌లో హాయ్‌ అని పలకరిస్తారు. ఎక్కడున్నావ్‌? అంటూ చనువుగా అడుగుతారు. సమాధానమిచ్చేలోపే మీకు గూగుల్‌ పే ఉందా? ఫోన్‌ పే ఉందా? అని ప్రశ్నిస్తూ నేరుగా అసలు విషయంలోకి వచ్చేస్తారు. అత్యవసరంగా కొంత డబ్బు అవసరముందని, పంపిస్తే రేపు ఉదయమే తిరిగి ఇచ్చేస్తానని చెప్పి పన్నాగానికి తెరలేపుతారు. మనకు తెలిసిన వ్యక్తే కదా! ఎంతో అవసరముంటేనే ఇలా డబ్బులు అడుగుతారు కదా! అని భావించి.. వారు ఇచ్చిన నంబర్లకు డబ్బులు పంపించారో మీరు మోసపోయినట్టే. ఫేస్‌బుక్‌ వేదికగా సైబర్‌ కేటుగాళ్లు అనుసరిస్తున్న సరికొత్త నేరవిధానమిది. వీరి ఉచ్చులో చిక్కుకుని వేల మంది డబ్బులు పొగొట్టుకుంటున్నారు. ఇటీవల ఈ తరహా ఘటనలు బాగా పెరిగాయి. మొదట్లో పోలీసు అధికారులు, వైద్యులు, సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తుల పేరిట ఫేస్‌బుక్‌లో నకిలీ ప్రొఫైల్స్‌ను సృష్టించి వాటిని అడ్డం పెట్టుకుని డబ్బులు దోచుకున్న సైబర్‌ నేరగాళ్లు.. ఇప్పుడు సామాన్యుల పేరిట నకిలీ ఖాతాలు సృష్టించి సొమ్ములు కొల్లగొడుతున్నారు.

అక్కడి ముఠాల పనే..

* ఈ తరహా నేరాలకు పాల్పడుతున్న వారిలో ఎక్కువ మంది రాజస్థాన్‌లోని భరత్‌పుర, నోయిడా, ఒడిశా, పశ్చిమబెంగాల్‌ తదితర ప్రాంతాలకు చెందిన వారే.
* వీరికి తెలుగు సరిగ్గా రాకపోవడంతో మెసెంజర్‌లో ఇంగ్లీష్‌లోనే సందేశాలు పంపిస్తున్నారు. తెలుగులో ఇవతలి వ్యక్తులు ఏం సమాధానమిచ్చినా సరే.. అవేవి పట్టించుకోకుండా.. నేరుగా గూగుల్‌ పే ఉందా? ఫోన్‌ పే ఉందా? డబ్బులు పంపించండి? అంటూ అడుగుతున్నారు.
* కొందరికి మొదట్లోనే వాటిపై సందేహం వచ్చి.. నకిలీ ప్రొఫైల్‌ ఎవరి పేరునైతే ఉందో వారిని సంప్రదించి నిజంగానే డబ్బులు అడిగారా? లేదా? అని తెలుసుకుంటున్నారు. మరికొందరు నకిలీ ఖాతాల ముసుగులో ఉన్న నేరగాళ్లకు డబ్బులు చెల్లించేసి ఆ తర్వాత డబ్బులు అందాయా? లేదా? అనే విషయాన్ని నిర్ధారించుకునేందుకు ఫోన్‌ చేసినప్పుడు మోసపోయామని గుర్తిస్తున్నారు.

వ్యవస్థీకృత నేరంపై అందని ఫిర్యాదులు

నకిలీ ప్రొఫైల్స్‌ నుంచి ఒకేసారి ఎక్కువ మొత్తం డబ్బులు అడగకుండా.. తక్కువ మొత్తాల్లో కోరుతున్నారు. బాధితులు మోసపోయామని తెలుసుకోగలిగినా పోలీసులకు ఫిర్యాదు చేయరని.. తాము పట్టుబడే అవకాశాలూ తక్కువగా ఉంటాయనే ఎత్తుగడతో ఇలా వ్యవహరిస్తున్నారు. వారూ ఊహించినట్లే.. మోసపోతున్న బాధితులు ఎవరూ ఫిర్యాదు చేయటానికి పెద్దగా ముందుకు రావట్లేదు. ఇదే అదనుగా చేసుకుని నేరగాళ్లు మరింత చెలరేగిపోతున్నారు. రోజూ కోట్లల్లో కొల్లగొడుతున్నారు. ఇంత వ్యవస్థీకృతంగా ఈ తరహా నేరం జరుగుతున్నా.. పోలీసులు సమాచారం ఉండటంలేదు. దాంతో ఈ ముఠాల మూలాలు ఎక్కడున్నాయి? ఎవరు దీన్ని నడిపిస్తున్నారనే అంశాలు వెలుగులోకి రావడంలేదు. లోతుగా దర్యాప్తు చేసి, నిందితులను పట్టుకుని, ఈ దందాకు అడ్డుకట్ట వేయటం పోలీసులకు పెద్ద కష్టమేమి కాదు. అయితే... ఆ దిశగా వారు చొరవే తీసుకోవాల్సి ఉంది.

ఈ జాగ్రత్తలు ఎంతో అవసరం

* తమ పేరిట ఫేస్‌బుక్‌లో ఏమైనా నకిలీ ఖాతాలు ఉన్నాయా? అనేది సెర్చ్‌ ఆప్షన్‌ ద్వారా ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి.
* నకిలీ ఖాతాల ఉన్నట్లు గుర్తిస్తే ‘రిపోర్టు’ అనే ఆప్షన్‌ ద్వారా ఫిర్యాదు చేసి.. దాన్ని బ్లాక్‌ చేయించాలి.
* ఫేస్‌బుక్‌ ఖాతాల్లో పోస్టు చేసే చిత్రాలకు లాక్‌ పెట్టుకోవాలి.
* ఎంత తెలిసిన వ్యక్తులైనా సరే మెసెంజర్‌ ద్వారా డబ్బులు అడుగుతున్నారంటే వారికి ఫోన్‌ చేసి నిర్ధారించుకోవాలి.

ఇదీ చదవండి: పేద, మధ్య తరగతులపై ధరల భారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.