ETV Bharat / crime

CASE ON MLA: ఆ వీడియోలు చూపించినందుకే.. తెలంగాణ భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌రావుపై కేసు..! - Case on MLA Raghunandan Rao

CASE ON MLA: దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావుపై హైదరాబాద్​ అబిడ్స్ పోలీస్​ స్టేషన్​లో కేసు నమోదైంది. జూబ్లీహిల్స్‌ అత్యాచార కేసులో బాలిక ఫొటోలు, వీడియోలు విడుదల చేశారని.... న్యాయవాది ఫిర్యాదు మేరకు రఘునందన్‌రావుపై కేసు దాఖలైంది.

CASE ON MLA
తెలంగాణ భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌రావుపై కేసు
author img

By

Published : Jun 7, 2022, 10:34 AM IST

CASE ON MLA: దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావుపై హైదరాబాద్​ అబిడ్స్ పోలీస్​ స్టేషన్​లో కేసు నమోదైంది. జూబ్లీహిల్స్‌ అత్యాచార కేసులో బాలిక ఫొటోలు, వీడియోలు విడుదల చేశారని.... న్యాయవాది ఫిర్యాదు మేరకు రఘునందన్‌రావుపై కేసు దాఖలైంది. రఘునందన్‌రావుపై ఐపీసీ 223(a) సెక్షన్ కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇటీవల రఘునందన్​రావు ప్రెస్​మీట్​లో జుబ్లీహిల్స్​ ఘటనకు సంబంధించిన ఆధారాలు కొన్నింటిని మీడియా ముందు బయటపెట్టారు. తమ వద్ద మరిన్ని ఆధారాలు ఉన్నాయని వాటిని పోలీసులకు, న్యాయస్థానానికి అందచేస్తామని తెలిపారు. ఈ క్రమంలోనే బాలిక ఫొటోలు, వీడియోలు విడుదల చేశారు. ఆ ఫొటోల్లో ఉన్నది ఓ ఎమ్మెల్యే కుమారుడు అని రఘునందన్ రావు ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఓ న్యాయవాది ఫిర్యాదు మేరకు అబిడ్స్ పీఎస్​లో రఘునందన్​రావుపై కేసు నమోదు అయింది. మరోవైపు సాముహిక అత్యాచార బాధితురాలికి సంబంధించిన వివరాలను రిలీజ్ చేసిన ఓ జర్నలిస్టు సుభాన్​పైన పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.