తుఫాన్ వాహనం.. బైకును ఢీ కొట్టిన ఘటనలో ఓ వ్యక్తి అక్కడిక్కక్కడే ప్రాణాలు కోల్పోయాడు. గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం గురాజవోలు గ్రామానికి చెందిన గారపాటి ఇస్మాయిల్ వ్యక్తి గత పని నిమిత్తం నుదురుపాడు వెళ్లాడు. అక్కడ ద్విచక్రవాహనంపై రోడ్డు దాటుతుండుగా నరసరావుపేట వైపు నుంచి గుంటూరు వైపు వెళ్తున్న తుఫాన్ వాహనం.. ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో ఇస్మాయిల్‌కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. పిరంగిపురం పోలీసులు మృత దేహాన్ని శవ పంచనామా నిమిత్తం నరసరావుపేట ఆసుపత్రి తరలించారు. మృతుడి బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇస్మాయిల్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.
ఇదీ చదవండి:
భారీగా అక్రమ మద్యం పట్టివేత.. అదుపులో నిందితులు
పర పరుషులతో మాట్లాడబోనని రాసివ్వాలన్నాడు.. అంగీకరించని భార్యను చంపబోయాడు..!