చిన్న వివాదం రెండు వర్గాలు మధ్య కోట్లాటకు దారి తీసింది. నడిరోడ్డు మీదనే ఒక వర్గం.. మరో వర్గానికి చెందిన యువకుడిని చితకబాదింది. ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలో ఈ ఘటన జరిగింది. కబాడీపాలెంకు చెందిన కొంతమంది వ్యక్తుల మధ్య ఓ కారు కొనుగోలు విషయంలో వివాదం ఏర్పడింది. ఆ వివాదం కాస్తా.. ఇరువురి మధ్య గొడవకు దారి తీసింది. సాయంత్రం మంగమూరు రోడ్డులో మరోసారి గొడవ జరిగింది. ఈ క్రమంలో కబాడీపాలెంకు చెందిన యువకులు... మరో వర్గానికి చెందిన యువకుడిని చితకబాదారు. విచక్షణారహితంగా కర్రలు, రాడ్లతో కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు.
తీవ్రంగా గాయపడిన యువకుడిని ఆసుపత్రికి తరలించారు. గొడవ సమయంలో అక్కడే ఉన్న ఓ కానిస్టేబుల్.. వద్దని వారిస్తున్నా లెక్క చేయకుండా దాడి చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి..
MURDER ATTEMPT: యువకుడిపై కత్తితో దాడి.. విషమంగా ఆరోగ్య పరిస్థితి