Hawala money seized in Hyderabad: హైదరాబాద్‌లో భారీగా హవాలా డబ్బు పట్టుబడుతోంది. రెండు రోజుల వ్యవధిలో నాలుగు కోట్ల రూపాయల నగదును పోలీసులు సీజ్ చేశారు. తాజాగా జూబ్లీహిల్స్ రోడ్ నంబర్-70లో భారీగా హవాలా డబ్బు పట్టుకున్నారు. కారులో తరలిస్తున్న రూ.2.5 కోట్లను వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు హవాలా డబ్బుగా గుర్తించి సీజ్ చేశారు. ఇందుకు సంబంధించి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. అశోక్‌సేన్, సుధీర్ కుమార్, రాము అనే ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఇవీ చదవండి: