ETV Bharat / city

విశాఖపై చంద్రబాబు కుట్ర పన్నుతున్నారు: విజయసాయిరెడ్డి

author img

By

Published : Dec 28, 2019, 4:17 PM IST

విశాఖ కేంద్రంగా పరిపాలన రాజధాని కాకుండా చంద్రబాబు కుట్ర చేస్తున్నారని... వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. అందుకోసం అన్ని వ్యవస్థలను ఉపయోగించుకోవాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు.

YCP leaders fire on chandrababu over vishaka

విశాఖ కేంద్రంగా పరిపాలన రాజధాని రాకుండా చంద్రబాబు కుట్ర చేస్తున్నారని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఈ మేరకు అన్ని మార్గాల్లో ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. న్యాయవ్యవస్థను ఉపయోగించుకోవాలని చూస్తున్నారని, విశాఖను పరిపాలన కేంద్రం చేయాలన్న ఉద్దేశాన్ని నీరుగార్చాలని కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. ఉత్తరాంధ్రకు తీరని ద్రోహం చేయాలనే తలంపు తెదేపాలో కనిపిస్తోందని మండిపడ్డారు. ‘ఆ పార్టీ నేతలంతా అమరావతి చుట్టుపక్కల కొన్ని వేల ఎకరాల భూములు కొన్నారు. ఆ భూముల ద్వారా వచ్చే లాభాన్ని విదేశాలకు తరలించాలన్న తలంపు వారిది. విశాఖ పరిపాలనకు అనుకూలంగా ఉందనే ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది’ అని విజయసాయి తెలిపారు.

డబ్బులు పెట్టి ఉద్యమం: అవంతి
తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు డబ్బులు పెట్టి అమరావతి ఉద్యమాన్ని నడిపిస్తున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్‌ ఆరోపించారు. అభివృద్ధి చేయలేదనే అమరావతి ప్రజలు ఆయన్ను తిరస్కరించారని పేర్కొన్నారు. ప్రతిపక్ష నాయకుడి హోదాలో మళ్లీ ఇప్పుడు మోసం చేయాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. వెనుకబడిన ప్రాంత అభివృద్ధికి చేస్తున్న కృషిని అడ్డుకోవడం దారుణమన్నారు.‘ చంద్రబాబు మాదిరిగా ఊహలు కల్పించడం సీఎం జగన్‌కు వీలుకాదు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై విచారణ జరిపి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. రాజధాని విషయంపై అసెంబ్లీలో చర్చిస్తాం. ప్రక్రియ అంతా పద్ధతి ప్రకారం జరుగుతుంది’ అని అవంతి వివరించారు.

ఇదీ చదవండి : 'రాష్ట్రానికి సీఎం జగనా... విజయసాయిరెడ్డా..?'

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.