ETV Bharat / city

విమ్స్​లో వైద్య సదుపాయాలు మెరుగు పరుస్తాం: మంత్రి అవంతి - విశాఖ విమ్స్ తాజా వార్తలు

విశాఖలోని విమ్స్​ను మంత్రి అవంతి శ్రీనివాసరావు సోమవారం సందర్శించారు. అక్కడి పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. విమ్స్​లో కొన్ని లోపాలున్న మాట వాస్తమేనని... వాటిని సరిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు.

minister avanthi srinivasa rao
మంత్రి అవంతి శ్రీనివాసరావు
author img

By

Published : Aug 3, 2020, 4:03 PM IST

మంత్రి అవంతి శ్రీనివాసరావుతో ముఖాముఖి

విశాఖలోని కొవిడ్ ఆసుపత్రి విమ్స్​లో వైద్య సదుపాయాలు పూర్తి స్థాయిలో మెరుగు పరుస్తామని మంత్రి అవంతి శ్రీనివాసరావు వెల్లడించారు. విమ్స్​లో కరోనా బాధితులను వైద్య సిబ్బంది పట్టించుకోవటం లేదని వార్తలు రావటంతో.. ఆసుపత్రిని మంత్రి అవంతి సోమవారం సందర్శించారు. సమస్యలు అధికారులను అడిగి తెలుసుకున్నారు.

విమ్స్​లో కొన్ని లోపాలున్నాయని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. సిబ్బంది నియామకానికి సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చామని తెలిపారు. కొవిడ్ విధులు నిర్వహించేందుకు వైద్య సిబ్బంది ముందుకు రావట్లేదని చెప్పారు. అలాగే విమ్స్‌లో సమన్వయలోపంపై సంయుక్త కలెక్టర్‌ అరుణ్​కుమార్​ ఆధ్వర్యంలో విచారణ కమిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కొవిడ్ బాధితుల బంధువులకు, వైద్యులకు మధ్య సమాచార లోపం లేకుండా అందుబాటులో ఇద్దరు వైద్యులను ఉంచుతున్నట్లు వెల్లడించారు.

ఇవీ చదవండి

విమ్స్​లో మంత్రి అవంతిని నిలదీసిన కరోనా రోగుల బంధువులు

'భయంగా ఉంది... ప్రాణాలతో ఇంటికి వెళ్తానో? లేదో?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.