Swatmanandendra Swamiji meet minister kishan reddy: దిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి కలిశారు. ఏపీలో పంచారామ క్షేత్రాల అభివృద్ధికి ప్రసాద్ స్కీమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని కిషన్ రెడ్డిని కోరారు. ఇవాళ ఢిల్లీలో కిషన్ రెడ్డి నివాసానికి వెళ్లి విశాఖ శ్రీ శారదాపీఠం వార్షికోత్సవాలకు ఆహ్వానించారు.
ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని దేవాలయాల అభివృద్ధి, హిందూ ధర్మ ప్రచారం సంబంధిత అంశాలపై కిషన్ రెడ్డితో మాట్లాడారు. తెలంగాణలో దశాబ్ధాలుగా కుంటుపడిన వేయి స్తంభాల గుడి అభివృద్ధికి రూ. ఆరు కోట్ల నిధులను సమకూర్చడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా పంచారామాలను అభివృద్ధి చేయడానికి పురావస్తు శాఖ అడ్డంకులు ఉన్నాయని.. దేవాదాయ శాఖ వినతులను పరిశీలించి పురావస్తు శాఖతో ఉన్న అడ్డంకులు తొలగేలా చూడాలని కోరారు.
ఆదివాసీల సాంప్రదాయాలు, కళలను కాపాడాలి..
Swatmanandendra Swamiji at Delhi: గిరిజన ప్రాంతాల్లో విశాఖ శ్రీ శారదాపీఠం చేపడుతున్న సేవా కార్యక్రమాలను కిషన్ రెడ్డికి వివరించారు. ఆదివాసీల సంప్రదాయాలు, కళలు మరుగున పడకుండా కేంద్ర సాంస్కృతిక శాఖ చర్యలు చేపట్టాలని.. వేద పాఠశాలలను శాఖాపరంగా ఆదుకోవాలని సూచించారు. విశాఖ శ్రీ శారదాపీఠం వార్షికోత్సవాల విశిష్టతను తెలిపారు. హిందూ ధర్మాన్ని వ్యాప్తి చేయడానికి వార్షికోత్సవాల వేదికగా చేపట్టే ఆధ్యాత్మిక కార్యక్రమాల గురించి కిషన్ రెడ్డికి వివరించారు. ఈ సందర్భంగా స్వాత్మానందేంద్ర స్వామితోపాటు ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ సీతంరాజు సుధాకర్.. కిషన్ రెడ్డిని కలిశారు.
ఇదీ చదవండి..
MP GVL Critics On YSRCP: వైసీపీకి.. కొత్త అర్థం చెప్పిన ఎంపీ జీవీఎల్