visakha ZP meeting: విశాఖ జిల్లా జెడ్పీ తొలి సర్వసభ్య సమావేశంలోనే అధికారపార్టీ ఎమ్మెల్యే, జెడ్పీటీసీ సభ్యుల మధ్య ప్రోటోకాల్‌పై వాగ్వాదం చోటుచేసుకుంది. జెడ్పీటీసీ సభ్యులకు మండల ఆఫీసుల్లో కనీసం కుర్చీలు కూడా వేయడం లేదని, మండల సర్వసభ్య సమావేశంలో మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వడం లేదని జెడ్పీ ఛైర్ పర్సన్ దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు రాజు స్పందిస్తూ... జెడ్పీటీసీ సభ్యులకు మండల ఆఫీసుల్లో ఛాంబర్లు కేటాయించే పరిస్థితి లేదన్నారు. దీంతో జెడ్పీటీసీ సభ్యులు వాగ్వాదానికి దిగడంతో ఒక్కసారిగా సమావేశం వేడెక్కింది. సభ్యులకు గౌరవం లేని చోట తమకు పదవులు ఎందుకని ప్రశ్నించారు.. మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాస్ అధ్వర్యంలో ఇదంతా జరగడంతో.. ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి
Students Letter to Principal for watching PUSHPA: సార్...పుష్ప సినిమాకి...మీకూ ఓ టిక్కెట్ ఉంది ..