ETV Bharat / city

ప్రత్యేక కిచెన్‌ వాహనాల తయారీలో విశాఖ యువకుడి ప్రతిభ - విశాఖ తాజా వార్తలు

Kitchen vehicles పుడ్‌ ఆన్‌ వీల్స్‌. ప్రస్తుతం ఈ పుడ్‌ వెహికల్స్ ఎంతో ఫేమస్‌. వాహనాలపైనే కిచెన్‌ సెటప్‌ చేసి ఆహారాన్ని అందించడం వీటి స్పెషాలిటీ. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇదే ట్రెండ్‌ కొనసాగుతోంది. ఎంతోమంది ఈ బిజినెస్‌ వైపు అడుగులేసి సక్సెస్‌ అవుతున్నారు. అలాంటి ప్రయత్నమే చేశాడు విశాఖకు చెందిన కిశోర్‌. ప్రత్యేక కిచెన్‌ వాహనాలను తయారు చేస్తూ ఫ్రాంచైజీలు ఇచ్చే స్థాయికి ఎదిగాడు. ఆ పుడ్‌ ఆన్‌ వీల్స్‌ విశేషాలేంటో మనమూ చూద్దామా.

Kitchen vehicles
ప్రత్యేక కిచెన్‌ వాహనాలు
author img

By

Published : Aug 18, 2022, 7:09 AM IST

ప్రత్యేక కిచెన్‌ వాహనాలు

Kitchen vehicles జోరుగా హుషారుగా షికారు పోదామా...కార్లో వెళితే బాగుటుంది కదూ. కానీ అదే కారులో తయారైన పుడ్‌ తింటే. అదెలా అంటారా... ఇలా. ఇక్కడ కన్పిస్తున్న కారుని చూడండి. ఇది కారు కాదు పుడ్‌ ఆన్‌ వీల్స్‌. ఇప్పటి వరకు... ట్రక్‌, ట్రాలీ వాహనాల కిచెన్‌లు చూశాము. ఇక్కడ మీరు చూస్తుంది మరో రకం అదే అంబాసిడర్‌ కార్‌ మోడల్‌ కిచెన్‌. కారులో బార్‌ బీ క్యూ కిచెన్‌ సెటప్‌ చేసి కస్టమర్లను ఆకర్షిస్తున్నాడు విశాఖ యువకుడు.

విశాఖకు చెందిన కిశోర్‌కు వచ్చిన ఓ వినూత్న అలోచన రూపమే ఈ అంబాసిడర్ బార్‌ బీ క్యూ. ఒకసారి టూరు కెళ్లిన కిశోర్‌. అక్కడ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ కంపెనీ బుల్లెట్‌ బార్‌ బీ క్యూ సెటప్‌ చూశాడు. అది అతనికి ఎంతగానో నచ్చింది. వెంటనే ఈ వ్యాపారం కోసం వాళ్లని సంప్రదించాడు. డబ్బులు లక్షల్లో ఖర్చు అవుతుండటంతో తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. కానీ, ప్రారంభించాలన్న అతడి ఆశ మాత్రం చావలేదు.

ఎట్టకేలాకు 2019లో మెుదటిసారి బుల్లెట్‌ కిచెన్‌ ప్రారంభించాడు. తనే సొంతంగా కిచెన్‌ వాహనాలను తయారు చేయడం మెుదలుపెట్టాడు. అది కాస్తా సక్సెస్‌ కావడంతో విభిన్న రకాల వింటేజ్‌ వెహికిల్‌ మోడల్స్‌ కిచెన్‌లను తయారు చేయడం మెుదలు పెట్టాడు.

ఈ బార్‌ బీ క్యూ కిచెన్‌లో తయారుచేసే ఆహార పదార్థాలకు పూర్తిగా ఆర్గానిక్‌ వంట సరకునే వాడటం మరో విశేషం. దీని కోసం కిశోర్‌ ప్రత్యేకంగా కేరళకు చెందిన ఓ మసాలా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అలా ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 125 ఔట్‌లేట్‌ ఫ్రాంచైజీలను నిర్వహిస్తున్నాడు కిశోర్‌.

అందరిలా కాకుండా ప్రత్యేకంగా తన వ్యాపారం ప్రత్యేకంగా ఉండాలని అనుకున్నాడు కిశోర్‌. ఆ ఉద్దేశంతోనే వింటేజ్‌ వాహనల బార్‌ బీ క్యూ కిచెన్‌ తయారు చేయడం మెుదలుపెట్టాడు. కేవలం ఒక సారి మాత్రమే ఫ్రాంచైజీ ఫీజు తీసుకుని వారికి కస్టమర్‌ సర్వీస్‌ను అందిస్తున్నాడు కిశోర్‌. ప్రస్తుతం అన్ని ఔట్‌లేట్లలో కలిపి సుమారు 170మంది వరకు కిశోర్‌ సంస్థలో పని చేస్తున్నారు.

కిశోర్‌ అందించే బార్‌ బీ క్యూ ఔట్‌లేట్లకు డిమాండ్‌ పెరిగింది. కొత్తగా ఈ వ్యాపారంలోకి వచ్చే వారికోసం వారి బడ్జెట్‌లో కిచెన్‌ వాహనాన్ని అందిస్తున్నాడు కిశోర్‌. ఇప్పటికే వ్యాపారం ప్రారంభించిన వారికి లాభాల బాగానే వస్తున్నాయని చెబుతున్నారు కస్టమర్లు.

"కిశోర్‌ అందించే బార్‌ బీ క్యూ ఔట్‌లేట్లకు డిమాండ్‌ పెరిగింది. కొత్తగా ఈ వ్యాపారంలోకి వచ్చే వారికోసం వారి బడ్జెట్‌లో కిచెన్‌ వాహనాన్ని అందిస్తున్నాడు కిశోర్‌. ఇప్పటికే వ్యాపారం ప్రారంభించిన వారికి లాభాల బాగానే వస్తున్నాయి."- కస్టమర్లు

ఇదే తరహాలో త్వరలో హెలికాప్టర్ కిచెన్‌ తీసుకరాబోతున్నట్లు చెబుతున్నాడు కిశోర్‌. దేశంలో మొదటిసారిగా ఓల్డ్ లిస్ట్ వెహికల్స్‌ను ఆకర్షణీయంగా తయారు చేస్తున్నామని త్వరలో దానిని ప్రజల ముందుకు తీసుకొస్తున్నాడు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.