విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు కార్మిక సంఘాలు విజ్ఞప్తి చేశాయి. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆల్ ఇండియా ఐఎన్‌టీయూసీ అధ్యక్షుడు జి. సంజీవరెడ్డి నేతృత్వంలో కార్మిక సంఘాల నేతలు ముఖ్యమంత్రి జగన్ను కలిసి వినతి పత్రం అందజేశారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసం విశాఖ ఉక్కును కాపాడుకోవాలని.. ప్రైవేటీకరణ జరిగితే కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా పోతుందని అన్నారు. ప్రైవేటీకరణ జరగకుండా చూడాలని ఉక్కు కార్మిక నేతలు ముఖ్యమంత్రిని కోరారు.
ఇదీ చదవండి: