ETV Bharat / city

విశాఖ పోలీసుల వినూత్న ఆలోచన... లఘుచిత్రంతో అవగాహన - విశాఖ పోలీసులు వార్తలు

మొన్నటి విజయవాడ ఘటన నుంచి నిన్నటి విశాఖ దుశ్చర్య వరకు... ప్రేమోన్మాదం రక్తాన్ని కళ్ల చూసింది. ప్రేమించిన వ్యక్తి వేరొకరితో సన్నిహితంగా ఉండడాన్ని భరించలేని అక్కసు ఇద్దరు యువతుల్ని బలి తీసుకుంది. ఈ ఉన్మాదానికి.. అడ్డుకట్ట వేసే దిశగా విశాఖ పోలీసులు నడుం బిగించారు. యువత ఆలోచనలు తప్పుదోవ పట్టకుండా వినూత్న కార్యక్రమం చేపట్టారు. నేటి యువత రేపటి పౌరులు అంటూ ఆలోచన రేకెత్తించే ప్రయత్నం చేస్తున్నారు.

నేటి యువత రేపటి పౌరులు  అవగాహన కార్యక్రమం

author img

By

Published : Nov 6, 2020, 5:26 PM IST

Updated : Nov 6, 2020, 6:09 PM IST

విశాఖ పోలీసుల వినూత్న ఆలోచన... లఘుచిత్రంతో అవగాహన

ప్రేమ పేరుతో వేధింపులు... దాడులు. అవునంటే అనుమానాలు, కాదంటే ప్రతీకారాలు. కత్తి కాచుకు కూర్చుందా అన్నట్లు విద్యార్థినులపై జరుగుతున్న వరుస దాడులు. తల్లిదండ్రుల్లోనే కాదు లక్షలాది మంది విద్యార్థుల్లో ఆందోళనకు దారితీస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన గాజువాక హత్యోదంతం నుంచి ఓ మార్పు కోసం నాంది పలికారు విశాఖ పోలీసులు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా యువతను చైతన్య పరిచే ఆలోచన చేశారు. ఆ దిశగా 'నేటి యువతే రేపటి పౌరులు' అనే నినాదంతో పెద్ద ఎత్తున అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.

కళాశాలలు, పాఠశాలల దత్తత కార్యక్రమం

ఈ కార్యక్రమంలో భాగంగా విశాఖ కమిషనరేట్ పోలీసు స్టేషన్ల పరిధిలోని కళాశాలలు, పాఠశాలల్లో తొలి విడతగా కొన్నింటిని దత్తత తీసుకుంటారు. ఒక పోలీసు ప్రతినిధి ఒక కళాశాల బాధ్యత తీసుకోవడం ద్వారా అక్కడ తలెత్తే ఇబ్బందులను గుర్తిస్తుంటారు. ప్రతి వారం కచ్చితంగా ఆ కళాశాలకు వెళ్లి అక్కడి సమస్యలను తెలుసుకుంటారు. తద్వారా సమస్య తీవ్రతను బట్టి వారికి అవగాహన కల్పించడం, తప్పు మార్గంలో ఆలోచన చేయకుండా ఉండడంపై వారికి కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. పోలీసులు నేరుగా ఈ తరహా కార్యక్రమం చేపట్టడం ద్వారా విద్యార్థుల్లోనూ పూర్తి స్థాయి భరోసా కలిగే అవకాశం ఉంటుందని సీపీ మనీష్ కుమార్ సిన్హా భావిస్తున్నారు. మరో వైపు నేరాలు చేయాలనే ఆలోచనను ఆదిలోనే అంతం చేయడం.. ఈ ప్రయత్నం ద్వారా సాధ్యపడుతుందని పోలీసులు విశ్వసిస్తున్నారు.

నేటి యువత రేపటి పౌరులు  అవగాహన కార్యక్రమం
నేటి యువత రేపటి పౌరులు అవగాహన కార్యక్రమం

లఘుచిత్రంతో అవగాహన

ప్రేమించిన వ్యక్తి ప్రాణాలను తీయాలన్న కసాయి ఆలోచన ఎంత తప్పు అనే విషయంపై పోలీసులు ఓ లఘు చిత్రాన్ని నిర్మించారు. అందులో పోలీసు సిబ్బంది వ్యాఖ్యాతలుగా వ్యవహరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సమాజంలో చైతన్యం, మేల్కొలుపు కలిగించే లక్ష్యంతో వివిధ కోణాల్లో యువత ఆలోచనల్ని మంచి మార్గంలో నడిపించే వీడియోల రూపకల్పన చేస్తున్నారు. విద్యాశాఖ, వివిధ కళాశాలలు, స్వచ్చంధ సంస్థల నుంచి సందేశాత్మక వీడియోలను పోలీసులు ఆహ్వానిస్తున్నారు.

ఇదీ చదవండి:

కొత్త పాలసీతో ఇసుక కష్టాలు తీరేనా?

Last Updated : Nov 6, 2020, 6:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.