విశాఖలోని నేవల్ డాక్ యార్డ్‌లో ప్రేరణ స్థల్‌ను తూర్పు నౌకాదళ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్ సిబ్బందికి అంకితం చేశారు. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా స్వయంసమృద్ధికి చిహ్నంగా ఈ ప్రేరణ స్థల్‌ను నావెల్ డాక్ యార్డులో ఏర్పాటు చేశారు. దేశీయంగానే యుద్ధ నౌకలు, జలాంతర్గాముల మరమ్మతులు, రీఫిట్ చేసే పనిని నేవల్ డాక్ యార్డులోనే నిర్వహించే సామర్థ్యం సాధించగలిగింది.
ప్రేరణ స్థల్లో 30.5 మీటర్ల జాతీయ జెండ్ పోల్‌ను ఏర్పాటు చేశారు. ఈ పోల్‌పై 20x30 అడుగుల జాతీయ జెండాను ఎగుర వేశారు. మార్చి 2021 నుంచి ఆరంభం కానున్న నేవల్ డాక్ యార్డు స్వర్ణోత్సవ సంబరాలకు ప్రేరణ్ స్థల్తో నాందిపలికారు.
ఇదీ చదవండి