శ్రీకాకుళం జిల్లాకు చెందిన బమ్మిడి గీత ప్రసాద్ మూడు నెలల క్రితం విశాఖ మురళీనగర్ ప్రాంతంలో గీతాలయ స్టూడియోస్ స్థాపించి జూనియర్ ఆర్టిస్ట్‌లు కావాలని పత్రిక ప్రకటన ఇచ్చాడు. ప్రకటన చూసిన చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన ఓ యువతి అతడిని సంప్రదించింది. సినిమాలో ఐటమ్ సాంగ్ అవకాశం కల్పిస్తానని నమ్మించి, మురళీనగర్‌లోని ఓ అపార్ట్ మెంట్లో ఆమెను ఉంచి చిన్నపాటి షూటింగ్‌లు నిర్వహించాడు. షూటింగ్ కోసం రూ.5 లక్షలు కావాలని యువతిని నమ్మించి.. ఆమె వద్ద నుంచి పలు దఫాలుగా గీత ప్రసాద్ డబ్బు తీసుకున్నాడు.
గీత ప్రసాద్ తీరుపై అనుమానం వచ్చిన యువతి... అతన్ని నిలదీసింది. దీంతో గీత ప్రసాద్ అతడి స్నేహితులు సత్యనారాయణ, షరీఫ్ ,కె.పి సారథి యువతిపై బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ ఘటనపై యువతి వెస్ట్ సబ్ డివిజన్ ఏసీపీ జి.స్వరూపరాణికి ఫిర్యాదు చేయడంతో.. ఏసీపీ సూచనల మేరకు కంచరపాలెం పోలీసులు గీత ప్రసాద్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. దర్యాప్తులో భాగంగా గీత ప్రసాద్‌తో పాటుగా అతడి స్నేహితులు షరీఫ్, సత్యనారాయణలను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు.
ఇదీ చదవండి : అప్పుడేమైపోయింది సీఐడీ... వైకాపా అక్రమాలపై అరెస్టులేవీ?