ETV Bharat / city

విశాఖ గ్రామీణంలో ఎక్సైజ్ స్టేషన్లు.. ఇకపై ఎస్​ఈబీ స్టేషన్లు! - ఏపీ తాజా వార్తలు

ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్​ శాఖను ప్రభుత్వం పునర్​ వ్యవస్థీకరిస్తోంది. ఇకపై మద్యం సరఫరా బాధ్యతలు మాత్రమే ఆ శాఖ చూడనుంది. గంజాయి, నాటుసారా, ఇసుక, మద్యం రవాణా అరికట్టడడం స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో (ఎస్​ఈబీ) పరిధిలోకి వచ్చాయి. అనకాపల్లిలో అసిస్టెంట్ ఎన్​ఫోర్స్​మెంట్ సూపరింటెండెంట్​ స్టేషన్​ దానిని రెండుగా విభజించనున్నారు. నర్సీపట్నంలో కొత్త స్టేషన్​ ఏర్పాటు చేయనున్నారు. ప్రతి జిల్లాకు ఒక ఏఎస్పీ స్థాయి అధికారిని ఇన్​ఛార్జిగా నియమించారు. దిగువ స్థాయిలో ఎక్కువ మంది సిబ్బందిని ఎస్​ఈబీకి బదలాయింపు చేశారు. దీంతో విశాఖ గ్రామీణ ప్రాంతంలోని ఎక్సైజ్ స్టేషన్లు ఇకపై ఎస్​ఈబీ స్టేషన్లుగా మారనున్నాయి.

excise police stations
excise police stations
author img

By

Published : Dec 5, 2020, 5:54 PM IST

రాష్ట్రంలోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖను ప్రభుత్వం పునర్​ వ్యవస్థీకరించనుంది. ఇకపై ఈ శాఖను కేవలం మద్యం సరఫరాకే పరిమితం చేయనుంది. ఎక్సైజ్ పోలీసుస్టేషన్లు అన్నీ స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో(ఎస్​ఈబి) స్టేషన్లుగా మారనున్నాయి. విశాఖ గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి అనకాపల్లిలో అసిస్టెంట్ ఎన్​ఫోర్స్​మెంట్ సూపరింటెండెంట్​ స్టేషన్ ఉండగా..దీనిని రెండుగా విభజించనున్నారు. జిల్లాలో ఏజెన్సీ ప్రాంతానికి ముఖద్వారంగా ఉన్న నర్సీపట్నంలో కొత్త స్టేషన్ ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

అనకాపల్లి జీవీఎంసీ పరిధిలో ఉండడంతో ఇక్కడి స్టేషన్ చోడవరానికి తరలించే ప్రతిపాదన కూడా సిద్ధమవుతున్నట్టు సమాచారం. కొత్తగా గొలుగొండలో ఎస్​ఈబీ స్టేషన్ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. గంజాయి, నాటుసారా, ఇసుక, మద్యం రవాణాను అరికట్టడానికి కొద్దిరోజుల క్రితమే స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో(ఎస్.ఈ.బి) ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ప్రతి జిల్లాకు ఒక ఏఎస్పీ స్థాయి అధికారిని ఇన్​ఛార్జిగా నియమించారు. దిగువ స్థాయిలో ఎక్కువ మంది సిబ్బందిని ఎస్​ఈబీకి బదలాయింపు చేసింది. దీంతో గ్రామీణ ప్రాంతంలోని ఎక్సైజ్ స్టేషన్లు ఇకపై ఎస్​ఈబీ స్టేషన్లుగా మారనున్నాయి. ఈ విభాగం పరిధిలోకి తాజాగా గుట్కా, ఆన్​లైన్​ జూదాన్ని కూడా చేర్చారు. ఇకపై ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కేవలం ప్రభుత్వ మద్యం అమ్మకాలకే పరిమితం కానుంది. ఇందుకు సంబంధించి జిల్లా అంతటికీ విశాఖలో మాత్రమే కార్యాలయం ఉంటుంది.

ప్రస్తుతం అనకాపల్లిలో ఉన్న అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయం ఇకపై అసిస్టెంట్ ఎన్​ఫోర్స్​మెంట్ సూపరింటెండెంట్ కార్యాలయంగా మారుతోంది. దీని పరిధిలో విశాఖ గ్రామీణం మొత్తం ఉంటుంది. పరిపాలనాపరంగా ఇబ్బందులు ఉండటంతో రెండుగా విభజించాలనే ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. కొత్తగా నర్సీపట్నంలో ఏఈఎస్​ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తారని అధికార సమాచారం. ప్రస్తుతం అనకాపల్లిలో నడుస్తున్న ఏఎస్ కార్యాలయాన్ని చోడవరానికి తరలిస్తారని తెలుస్తోంది. అనకాపల్లి పట్టణం విశాఖ జీవీఎంసీ పరిధిలో ఉండటమే ఇందుకు కారణమని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

నర్సీపట్నం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఇప్పటివరకు నర్సీపట్నం, రోలుగుంట, మాకవరపాలెం, కోటవురట్ల, గొలుగొండ, నాతవరం, కొయ్యూరు మండలాలు ఉన్నాయి. ఈ పరిధి ఎక్కువగా ఉండడంతో ఎదురవుతున్న ఇబ్బందుల దృష్ట్యా నర్సీపట్నం స్టేషన్ పరిధిని రెండుగా విభజించి అదనంగా గొలుగొండలో కొత్త స్టేషన్ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక నుంచి నర్సీపట్నం స్టేషన్ పరిధిలో నర్సీపట్నం, రోలుగుంట, మాకవరపాలెం, కోటవురట్ల మండలాలు మాత్రమే ఉంటాయి. నిన్న మొన్నటివరకు నర్సీపట్నం స్టేషన్​లో విలీనమైన నాతవరం, గొలుగొండ, కొయ్యూరు మండలాలు ఇక నుంచి నూతనంగా ఏర్పాటు చేయబోయే గొలుగొండ స్టేషన్ పరిధిలోకి వస్తాయి. ఈ మూడు మండలాల పరిధిలో ఇప్పటివరకు నమోదైన కేసులు, సీజ్ చేసిన వాహనాలను నర్సీపట్నం నుంచి గొలుగొండకు బదలాయిస్తారు. నూతనంగా ఏర్పాటు చేయనున్న గొలుగొండ స్టేషన్ ఇన్​స్ఫెక్టర్​గా ప్రస్తుతం నర్సీపట్నం ఇన్​స్ఫెక్టర్​గా వ్యవహరిస్తున్న మహేష్​ను ఇన్​ఛార్జిగా నియమించనున్నట్లు తెలుస్తోంది.

ఇక జిల్లాలోని సబ్బవరం ఎక్సైజ్ స్టేషన్ పూర్తిగా తొలగించనున్నారు. ఇందులోని ఫర్నిచర్, వాహనాలను గొలుగొండ స్టేషన్​కు తరలిస్తున్నారు. ఈ కారణంగా సబ్బవరం మండలాన్ని అనకాపల్లిలోనూ, పరవాడ మండలాన్ని గాజువాకలోనూ విలీనం చేస్తారు. యలమంచిలి సర్కిల్ పరిధిలోని ఎస్.రాయవరం మండలాన్ని పాయకరావుపేటలో, చోడవరం సర్కిల్ పరిధిలోని రావికమతం మండలాన్ని వి.మాడుగులలో విలీనం చేయనున్నారు. ఎక్సైజ్ స్టేషన్ల పునర్​ వ్యవస్థీకరణలో భాగంగా సర్కిల్ ఇన్​స్ఫెకర్లు ఇతర అధికారులకు త్వరలోనే స్థానచలనం కలిగే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

ఇదీ చదవండి : 1971 యుద్ధంలో భారత వీరుల విజయానికి గుర్తు.. నేవీ డే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.