ETV Bharat / city

ప్రకృతి వైవిధ్య మణిహారం.. విశాఖ మహానగరం - విశాఖ తాజా వార్తలు

సుమనోహర సుందర నగరం. ఎత్తైన కొండలు..సువిశాల సాగర తీరం. ఆహ్లాదాన్ని పంచే రమణీయత. ఆనందాన్ని కలిగించే హరిత మాధుర్యం. తూర్పు తీర ప్రాంత అద్భుతంగా.. సాగర నగరిగా పేరొందిన విశాఖ నగరం... వైవిధ్యానికి నిలువెత్తు నిదర్శనం. పచ్చని పసిడి సిరులను తలపించే కనుమలు. కనులకింపుగా కనిపించే సాగరం. ప్రకృతి సంపదను సాక్షాత్కరించే ఎర్రమట్టిదిబ్బలు. ఇలాంటి మరెన్నో ప్రత్యేకతల సమాహారం విశాఖ నగరంపై ప్రత్యేక కథనం.

ప్రకృతి మణిహారం ఈ సాగర నగరం
ప్రకృతి మణిహారం ఈ సాగర నగరం
author img

By

Published : Jun 5, 2020, 1:58 PM IST

విశాఖ నగరమంటే ముందుగా గుర్తుకు వచ్చేది ఆహ్లాదకర వాతావరణం. ఎటు చూసినా పచ్చదనం, సుందర సాగరతీరం, పచ్చని కొండలు. ఈ వైవిధ్యాలే విశాఖకు ప్రత్యేక గుర్తుంపు తెస్తున్నాయి. కాలమేదైనా విశాఖలో అందాలకు కొదవేలేదు. వేసవిలో 40 డిగ్రీలకు మించని ఉష్ట్రోగతలు...వర్షాకాలంలో కొండలను కమ్మేసే మేఘాలు, చలికాలంలో అరకు, లంబసింగి అందాలు వర్ణణాతీతం. ఆంధ్రా ఊటీ సొగబులు పర్యాటకులను మైమరపిస్తాయి.

గిరులు...సుందర రమణులు

విశాఖ నగరం అనగానే ముందుగా గుర్తొచ్చేవి... పచ్చని కొండలు. సింహాచలేశుడు కొలువు తీరిన సింహగిరి, సాగర తీరంలోని యారాడ కొండ, కంబాల కొండ, బౌద్ధ భిక్షువులకు ఆవాసంగా నిలిచిన తొట్లకొండ... ఇలా విశాఖ చుట్టుపక్కల ఎటు చూసినా పసిడి వన్నెలతో కొండలు కనువిందు చేస్తుంటాయి.

ఎన్నెన్నో జాతులు

జీవ వైవిధ్యానికి పెట్టింది పేరు సింహగిరి. ఈ కొండపై 300 రకాల మొక్కల జాతులు ఉన్నాయి. ఒకప్పుడు సింహగిరిపై సంపంగి తోటలు ఉండేవి. సువాసన వెదజల్లే సంపంగి తోటలు కాలనుగుణంగా కనుమరుగయ్యాయి. పుష్ప జాతి మొక్కలు, ఫల జాతి మొక్కలతో పాటు సింహగిరిపై ఉండే 14 వరకు జలధారలు... ఇక్కడి జీవవైవిధ్యానికి ఎంతగానో దోహదం చేసేవి. ఎన్నో రకాల పక్షులు, జంతువులకు సింహగిరి ఆవాసంగా ఉండేది.

వాతావరణ మార్పులతో చాలా జాతుల మొక్కలు నశించిపోయాయని నిపుణులు చెబుతున్నారు. జలధారల్లో ఇప్పుడు 8 వరకు మాత్రమే కనిపిస్తున్నాయి. గంగధార, చాకిదార, అనంతామృతదార... సీతమ్మదార, మాధవదార తప్పమిగిలిన వాటిలో అంతంత మాత్రంగానే నీటి ప్రవాహం ఉంటోంది. ఈ కొండపై 9 రకాల పనస, 6 రకాల సంపంగి, సీతాఫలం, రామఫలం, లక్ష్మణఫలం ఇంకా ఎన్నో రకాల ఫలాలు ఉండేవి. మారుతున్న కాలంతో పాటు అడవిలోకి వెళ్లే వారి సంఖ్య కూడా క్రమంగా తగ్గడంతో ఈ మెక్కలూ అంతరించిపోతున్నాయి.

కంబాల అబ్బో అనేలా

విశాఖ కంబాలకొండ జీవ వైవిధ్యంలో మరో ప్రత్యేక ఆకర్షణ. నగరానికి ఆనుకుని 17 వేల ఎకరాల్లో విస్తరించిన ఈ అటవీ ప్రాంతం ఓ అద్భుతం. కంబాలకొండను వైల్డ్ లైఫ్ సాంక్చురీగా గుర్తించారు. కంబాలకొండపై 30కి పైగా వృక్షజాతులు కనిపిస్తాయి. సుమారు 20 జంతు జాతులు కంబాల కొండల్లో నివశిస్తున్నాయి. సాగరానికి చేర్చి ఉండే యారాడ కొండ, తొట్లకొండ సైతం ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. సముద్ర గాలులను తట్టుకుని పెరిగే వృక్ష జాతులు ఇక్కడ కనిపిస్తాయి.

సాగర తీరం ఓ మణిహారం

విశాఖ అంటే గుర్తుకు వచ్చే మరో విషయం సాగర తీరం. సుందర నగరానికి ఓ మణిహారంలా కనిపిస్తుంది. తుపాన్ల దాటికి తీరం కోతకు గురవుతుంది. మడ అడవులు చాలా వరకు తగ్గిపోవడం తీరం కోత సమస్యకు ఓ కారణంగా చెబుతుంటారు. విశాఖకు భౌగోళిక వారసత్వ సంపదగా వచ్చిన ఎర్రమట్టి దిబ్బల పరిరక్షణ సైతం ఎంతో ముఖ్యమని చెప్పాలి. అక్కడి వాతావరణాన్ని కాపాడడం... పర్యాటకం పేరుతో జరిగే కాలుష్యాన్ని నియంత్రించడం తక్షణం అవసరమని పర్యావరణ ప్రేమికులు భావిస్తున్నారు.

అభివృద్ధి పేరుతో ప్రకృతి వన్నెకు చేటుచేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. హుద్ హుద్ వంటి మహా విలయాన్ని తట్టుకుని నిలబడిన విశాఖ పడి లేచిన కెరటంలా... ప్రకృతి రమణీయతను పంచడంలో ఎప్పుడూ ఆదర్శంగా నిలుస్తూనే ఉంటుంది.

ఇదీ చదవండి : 'జూన్​ 8 నుంచి హోటళ్లకు అనుమతి.. నిబంధనల మేరకే కార్యకలాపాలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.