VISAKHA AGENCY BEAUTY: విశాఖ పాడేరు ఏజెన్సీలో పర్యాటకుల తాకిడి ఎక్కువైంది. ఒక పక్క చలిగాలులు.. మరో పక్క మంచు అందాలు చూపరులను కట్టిపడేస్తున్నాయి. పాడేరు సమీపాన ఉన్న వంజంగి కొండలు పర్యాటకుల తాకిడితో కిటకిటలాడుతున్నాయి. రాత్రి నుంచి వంజంగి కొండలపై భాగాన పర్యాటకులు తాకిడి పెరిగింది. వీరు.. లేలేత కిరణాలతో ఉదయించే సూర్యుడిని వీక్షించేందుకు పోటీ పడ్డారు. ఎత్తయిన కొండలు మధ్యలో మంచు కైలాసంలో తేలియాడుతున్న దృశ్యాలు పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి.
మన్యంలో చలి.. కనిష్ఠ ఉష్ణోగ్రతలు..
విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీలో చలి తీవ్రత భారీగా పెరిగింది. చింతపల్లిలో 5.8, పాడేరులో 8 డిగ్రీలు, మినుములూరులో 7 డిగ్రీలు, లంబసింగిలో 4.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మన్యంలో అనేక చోట్ల రహదారులు పొగమంచు కమ్ముకోవడంతో.. వాహనదారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీని వల్ల కొన్ని చోట్ల ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. తెల్లవారు జాము నుంచి ఉదయం తొమ్మిది గంటల వరకు ఏజెన్సీలో పొగమంచు ప్రభావం కొనసాగుతోంది. సాయంత్రం నాలుగు గంటల నుంచే చలి వణికిస్తోందని స్థానికులు అంటున్నారు. దీంతో ఏజెన్సీకి పర్యాటకుల తాకిడి పెరిగింది. రానున్న రోజుల్లో చలితీవ్రత మరింత పెరిగే అవకాశాలున్నట్లు వాతావరణ అధికారులు చెబుతున్నారు.
ఇదీ చదవండి:
Papikondalu Boat Tourism: పర్యాటకులకు గుడ్న్యూస్.. పాపికొండలు యాత్ర పునఃప్రారంభం