- విశాఖలో లోకేశ్ మీడియా సమావేశాన్ని అడ్డుకున్న పోలీసులు, ఉద్రిక్తత
తెదేపా నేత నారా లోకేశ్ మీడియా సమావేశాన్ని పోలీసులు అడ్డుకున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస పర్యటనకు వెళ్లిన ఆయన్ను అక్కడి పోలీసులు అడ్డుకోవడంతో తిరిగి విశాఖ చేరుకొని అక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశానికి అనుమతి లేదంటూ ఆయన మీడియాతో మాట్లాడుతుండగానే పోలీసులు అడ్డుకున్నారు.
- సాయంత్రం దిల్లీకి సీఎం జగన్, రేపు ప్రధానితో భేటీ
CM JAGAN ముఖ్యమంత్రి జగన్ నేడు దిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలపై ప్రధాని మోదీతో రేపు ఉదయం చర్చించనున్నారు.
- నిజామాబాద్‌లో ఇద్దరు పిల్లలు సహా దంపతుల ఆత్మహత్య
family suicide తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ హోటల్లో ఇద్దరు పిల్లలతో సహా దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. భార్య, పిల్లలకు పురుగుల మందు తాగించి తరువాత, సుర్యప్రకాశ్ ఉరి వేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.
- ఉన్మాదిగా మారిన కుమారుడు, తండ్రి ఏం చేశాడంటే
ఆర్మీలో మంచి ఉద్యోగం. చేతికి అందివచ్చిన కుమారుడు కుటుంబానికి ఆసరాగా ఉంటాడని ఆ తల్లిదండ్రులు భావించారు. కానీ ఏం జరిగిందో తెలియదు కుమారుడు ఉన్మాదిగా మారాడు. అతని ప్రవర్తన సరిగా లేకపోవడంతో ఉద్యోగం కోల్పోయాడు. దీంతో చేసేదేమీ లేక ఇంటికి వచ్చాడు. పోనీ తర్వాతైనా సరిగా ఉంటాడనుకుంటే చుట్టుపక్కల వాళ్లతో నిత్యం గొడవలే.
- ఎయిర్‌పోర్ట్‌లో రూ.60 కోట్లు విలువైన డ్రగ్స్ సీజ్
రూ.60 కోట్లు విలువ చేసే డ్రగ్స్‌ను సీజ్ చేశారు కొచ్చి విమానాశ్రయ భద్రతా సిబ్బంది. జింబాబ్వే నుంచి అక్రమంగా తరలిస్తున్న 30 కేజీల డ్రగ్స్‌ను నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్నారు.
- కాంగ్రెస్‌కు ఆనంద్ శర్మ షాక్, కీలక పదవికి రాజీనామా, ఆజాద్ బాటలోనే
హిమాచల్‌ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ స్టీరింగ్ కమిటీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు సీనియర్ నేత ఆనంద్ శర్మ. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు.
- పదవీ విరమణ ప్రశాంతంగా సాగేలా ఆర్థిక పాఠాలివిగో
పదవీ విరమణ చేశాక కూడా జీవితం ప్రశాంతంగా సాగేలా ముందే ప్రణాళిక చేసుకోవడం ఈరోజుల్లో తప్పనిసరి. ఖర్చులు పెరుగుతున్న ప్రస్తుత రోజుల్లో పూట గడవాలంటే కష్టంగా మారింది. అందుకే ఎలాంటి చింతా లేకుండా పక్కా ప్రణాళికతో ముందుకెళ్తే మంచిదని చెబుతున్నారు నిపుణులు.
- పుతిన్ సన్నిహితుడి కుమార్తె హత్య, కారు బాంబు పేల్చి
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు అత్యంత సన్నిహితుడైన అలెగ్జాండర్ డుగిన కుమార్తెను కారు బాంబు పేల్చి హత్య చేశారు. ఈ ఘటన మాస్కోలో శనివారం జరిగింది.
- కిరాక్ లుక్‌లో చిరు, భోళాశంకర్ రిలీజ్ డేట్ ఎప్పుడంటే
సోమవారం మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు నేపథ్యంలో అభిమానులకు భోళాశంకర్ మూవీ టీమ్ ట్రీట్ ఇచ్చింది. చిరు స్టైలిష్ లుక్‌లో ఉన్న పోస్టర్‌ను విడుదల చేసింది. దీంతో అభిమానులు ఆనందంతో సంబరాలు చేసుకుంటున్నారు.
- క్లీన్‌స్వీప్‌పై టీమ్ఇండియా కన్ను, రాహుల్ లయ అందుకునేనా
రెండు వన్డేల్లో జింబాబ్వేను చిత్తుగా ఓడించిన భారత్, ఆ జట్టుతో మూడో మ్యాచ్‌కు సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని భావిస్తోంది. అన్ని విభాగాల్లో బలహీనంగా కనిపిస్తున్న జింబాబ్వే ఈ మ్యాచ్‌లో భారత్ జోరును తట్టుకొని నిలవాలంటే ఏదైనా మేజిక్ చేయాల్సి ఉంటుంది.
5PM AP TOP NEWS ప్రధాన వార్తలు - ఏపీ ప్రధాన వార్తలు
.
top news

Last Updated : Aug 21, 2022, 5:31 PM IST