ETV Bharat / city

బాబు భద్రతపై ఆందోళన... తెదేపా నేతల అర్ధనగ్న ప్రదర్శన - chandra babu security

నిన్న గన్నవరం విమానాశ్రయంలో చంద్రబాబును సామాన్య ప్రయాణికుడిలా ట్రీట్ చేయడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ తీరుకు నిరసనగా విశాఖలో తెదేపా ఎమ్మెల్యేలు అర్ధ నగ్న ప్రదర్శన చేపట్టారు.

తెదేపా ఎమ్మెల్యేల ఆందోళన
author img

By

Published : Jun 15, 2019, 1:48 PM IST

బాబు భద్రతపై తెదేపా ఎమ్మెల్యేల ఆందోళన

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు గన్నవరం విమానాశ్రయంలో జరిగిన అవమానం పట్ల విశాఖలో ఎమ్మెల్యేలు అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. జీవీయంసీ గాంధీ విగ్రహం వద్ద తెదేపా ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్ కుమార్, వెలగపూడి రామకృష్ణబాబులు ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జడ్ ప్లస్ క్యాటగిరీ భద్రత కలిగిన వ్యక్తిని.. సాధారణ ప్రయాణికులు వెళ్లే దారిలో పంపించడం, తనిఖీలు చేయడం దారుణమని అన్నారు. తెదేపా అధినేతకు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ పాదయాత్ర చేస్తే ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా పూర్తి భద్రతను అందించామని గుర్తు చేశారు. నిరసన ప్రదర్శన అనంతరం జిల్లా కలెక్టర్​ను కలిసి వినతిపత్రం సమర్పించారు.

సంబంధిత కథనం

గన్నవరం విమానాశ్రయంలో చంద్రబాబుకు తనిఖీలు

Intro:AP_RJY_56_15_KONASEEMA TIRUPATI_AV_C9

తూర్పు గోదావరి జిల్లా
కంట్రిబ్యూటర్ ఎస్ వి కనికి రెడ్డి
కొత్తపేట

కోనసీమ వెంకన్న దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. ఏడు శనివారాల వెంకన్న దర్శనం ఏడేడు జన్మల పుణ్య ఫలం అని 7 శనివారాలు నోము నోచుకునే భక్తులతో కోనసీమ తిరుపతి గా పేరుగాంచిన తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో నిండిపోయింది

Body:రాష్ట్ర నలుమూలల నుంచి నోము నోచు కునేందుకు వేల సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు ఏడు వారాల పాటు ఏడు ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకుంటే తాము కోరుకున్న కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో స్వామివారి దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పడుతుంది

Conclusion:వచ్చిన భక్తులకు దేవాదాయ శాఖ అన్ని ఏర్పాట్లు చేశారు అలాగే భక్తులందరికీ అన్నసమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.