విశాఖ ఉక్కు కోసం విజయసాయిరెడ్డి పాదయాత్ర చేయడంపై తెలుగుదేశం నేతలు విమర్శనాస్త్రాలు సంధించారు. విశాఖ ఉక్కు కోసం అధికార పార్టీ నాయకులు కేంద్రం ముందు సాగిలపడటం కాకుండా... పోరాటం ఏమైనా చేస్తారా అని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి నిలదీశారు. ఆంధ్రా బ్యాంక్ లాగానే విశాఖ స్టీల్ ప్లాంటును లేకుండా చేస్తారా? అని ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్రైవేట్ పరం కావడానికి ప్రధాన సూత్రధారి, మార్గదర్శి, మధ్యవర్తి ఒకరేనని..మరో నేత వర్ల రామయ్య ఆరోపించారు. చేసేదంతా చేసి.. పాదయాత్రతో మభ్యపెట్టాలనుకుంటే సాధ్యపడదన్నారు.
ఇదీచదవండి
2022 నాటికి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి: డీడీఆర్‌పీ ఛైర్మన్