విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తెదేపా ఖండించింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మంది స్టీల్ ప్లాంట్‌పై ఆధారపడి ఉన్నారని తెదేపా విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉండటానికి హుద్ హుద్, కొవిడ్ ప్రభావం చూపించాయన్నారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే.. ఉద్యమిస్తామని పల్లా శ్రీనివాసరావు హెచ్చరించారు.
ఇదీ చదవండి: విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు పచ్చజెండా!