విశాఖ- సికింద్రాబాద్ మధ్య సూపర్ ఫాస్ట్ ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు తూర్పుకోస్తా రైల్వే ప్రకటించింది. 02204 నంబర్ రైలు సికింద్రాబాద్ లో రాత్రి 8 గంటల 15 నిమిషాలకు బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 6 గంటల 25 నిమిషాలకు విశాఖ చేరుకుంటుంది. ఈ నెల 27 నుంచి సోమ, బుధ, శనివారాల్లో ఈ ప్రత్యేక రైలు సేవలు ప్రారంభమవుతాయి.
02203 నంబర్ రైలు విశాఖలో రాత్రి 7 గంటల 50 నిమిషాలకు బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 6 గంటల 5 నిమిషాల కు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈనెల 28 నుంచి ప్రతీ మంగళ, గురు, ఆదివారాల్లో ఈ రైలు నడపనున్నారు. ఈ రైళ్లకు గుంటూరు, విజయవాడలో మాత్రమే స్టాపులు ఉండనున్నాయి. ఈ రైళ్లలో 11 థర్డ్ ఏసీ, 3 సెకెండ్ ఏసీ, ఒక ఫస్ట్ ఏసీ బోగీలు ఉంటాయని.. తూర్పుకోస్తా రైల్వే తెలిపింది.
ఇదీ చదవండి: