విద్యార్థులు చదువుతోపాటు నూతన ఒరవడిలో అధ్యయనాలు చేయడం అలవర్చుకోవాలని పర్యటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. విశాఖపట్నంలో జిల్లా స్థాయి విద్య వైజ్ఞానిక ప్రదర్శనకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనకు జిల్లా వ్యాప్తంగా సుమారు మూడు వందల ఇరవై పాఠశాలల నుంచి విద్యార్థులు హాజరయ్యారు. చదువులతో మానవాళికి ఉపయోగపడే ఆధునిక పరికరాలను తయారు చేసి ప్రదర్శించారు. ఒంటరిగా రోడ్లపై వెళ్తున్న మహిళలకు రక్షణ కల్పించడం, చూపు లేక బాధపడుతున్న అంధులకు సెన్సార్ల ద్వారా ప్రమాదాలు నివారించడం వంటి ప్రయోగాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఇదీ చదవండి:
విశాఖ జిల్లాలో పింఛన్దారులు ఆందోళన...!