ప్రయాణికుల రద్దీ లేని కారణంగా విశాఖ నుంచి నడుస్తున్న కొన్ని ప్రత్యేక సర్వీసులను రద్దు(Trains cancelled) చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ నెల 11 నుంచి 21 వరకు నడవనున్న రైళ్లు ఈ జాజితాలో ఉన్నాయి.
రద్దయిన రైళ్ల వివరాలు..
- ఈ నెల 11 నుంచి 20 వరకు విశాఖపట్నం-కాచిగూడ (08561) మధ్య నడిచే ప్రత్యేక రైలు సర్వీసు
- ఈ నెల 12 నుంచి 21 వరకు కాచిగూడ-విశాఖపట్నం (08562) మధ్య నడిచే ప్రత్యేక రైలు సర్వీసు
- ఈ నెల 11 నుంచి 20 వరకు విశాఖపట్నం-కడప (07488) మధ్య నడిచే ప్రత్యేక రైలు సర్వీసు
- ఈ నెల 12 నుంచి 21 వరకు కడప-విశాఖపట్నం (07487) మధ్య నడిచే ప్రత్యేక రైలు సర్వీసు
- ఈ నెల 11 నుంచి 20 వరకు విశాఖపట్నం-లింగంపల్లి (02831) మధ్య నడిచే ప్రత్యేక రైలు సర్వీసు
- ఈ నెల 12 నుంచి 21 వరకు లింగంపల్లి-విశాఖపట్నం (02832) మధ్య నడిచే ప్రత్యేక రైలు సర్వీసు
ఇవీ చదవండి:
వారికి రేషన్ కార్డులు అందేలా చూడండి : కేంద్రం
Anandaiah Medicine: 3 నెలల తర్వాతే.. ఆనందయ్య చుక్కల మందు..!