విశాఖపట్నం జిల్లా చిట్టివలస జ్యూట్ మిల్లు కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించింది. మిల్లు యాజమాన్యం, కార్మిక సంఘాలతో సచివాలయంలో మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాస్, కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. కార్మికులకు ఐదున్నర నెలలుగా వేతనాలు ఇవ్వలేదని, వాటిని చెల్లించేందుకు యాజమాన్యం అంగీకారం తెలిపినట్లు మంత్రులు తెలిపారు. పదేళ్లక్రితం లాకౌట్ చేసిన సంస్థకు సంబంధించిన అపరిష్కృత సమస్యను పరిష్కరించినట్లు తెలిపారు.
ఇదీ చదవండి... పులల సంఖ్య పెరుగుదలపై సీఎం హర్షం