సింహాచలం శ్రీవరాహలక్ష్మీ నరసింహస్వామి చందన దీక్షలు సింహగిరిపై శనివారం ప్రారంభం అయ్యాయి. 42 రోజుల పాటు చందన దీక్షలు జరగనున్నాయి. కరోనా కారణంగా చందన దీక్ష చేపట్టే స్వాముల ఇరుముడిని కొండపైకి అనుమతి ఇవ్వటం లేదు. దీక్షలను అధికారికంగా ప్రకటించలేదు. చందన దీక్ష తీసుకున్న స్వాములు ఇరుముడి వారి పీఠంలోనే సమర్పించి స్వామి దర్శనం చేసుకోవాల్సిందిగా దేవాదాయ శాఖ సూచించింది. దీంతో సింహగిరి దిగువన భక్తులు పీఠంగా ఏర్పడి మాల వేసుకుని స్వామి భజన కార్యక్రమాలు ప్రారంభించారు. ప్రతి ఏడాది దీక్ష చేపట్టే భక్తులకు దేవాదాయశాఖ వస్త్రాలను ఉచితంగా ఇచ్చేది. ఈ ఏడాది కరోనా నిబంధనలు కారణంగా భక్తులకు వస్త్రాలు ఇవ్వడంలేదని ప్రకటించింది.
ఇదీ చదవండి : 'తుపాను బాధిత మృతుల కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి'