Mutthamshetty Srinivasa Rao: విశాఖ జిల్లా అనంతపురం మండలం రామవరంలో మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు చేదు అనుభవం ఎదురైంది. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా.. రామవరానికి వెళ్లిన అవంతిని గ్రామస్థులు చుట్టుముట్టారు. గతంలో ఇచ్చిన హామీలపై నిలదీశారు. సెల్‌టవర్, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తానని చెప్పి ఇప్పటివరకు ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. ఏళ్ల తరబడి రహదారి కనీసం మరమ్మతులు కూడా నోచుకోలేదని... గుంతలతో నిత్యం సతమతమవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్థులు చుట్టుముట్టేసరికి అసహనానికి గురైన మాజీ మంత్రి వారి మీద ఎదురుదాడికి దిగారు.
ఇవీ చదవండి: