జాతీయ సీనియర్ నేషనల్ బాడీ బిల్డింగ్ ఛాంపియన్‌షిప్-2021ను ఏప్రిల్ 23 నుంచి 25వ తేదీ వరకు విశాఖలో నిర్వహించనున్నట్లు వరల్డ్ బాడీ బిల్డింగ్ అండ్ ఫిజిక్ స్పోర్ట్ ఫెడరేషన్ (డబ్ల్యూబీపీబీఎఫ్) ప్రధాన కార్యదర్శి చేతన్ పత్రి ప్రకటించారు. నగరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ పోటీల్లో దేశం నలుమూలల నుంచి 500 మంది క్రీడాకారులు, 250 మంది క్రీడా అధికారులు పాల్గొననున్నట్లు వివరించారు. 55, 60, 65, 70, 80, 90, 100 కేజీలపై 10 విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. వీటితోపాటు ఎత్తు, బరువుకి సంబంధించి రెండు విభాగాల్లో పోటీలు ఉంటాయన్నారు.
ప్రతిష్ఠాత్మకమైన ఈ పోటీలను ఆంధ్ర బాడీ బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉక్కు నగరంలోని గురజాడ కళాక్షేత్రంలో నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఇండియన్ బాడీ బిల్డర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి హీరల్ సేథ్, ఆంధ్ర విభాగం అధ్యక్షుడు స్వామి రమేష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: