ETV Bharat / city

'భద్రతా లోపాలకు ఈ ప్రమాదం అద్దం పడుతుంది' - Security vulnerabilities in HSL Visakha

విశాఖ హిందుస్థాన్ షిప్ యార్డ్​లో క్రేన్ కూలిన దుర్ఘటనపై వివిధ కమిటీలు విచారణ చేయనున్నాయి. భద్రతా లోపాలకు ఈ ప్రమాదం అద్దం పడుతుందని కార్మిక వర్గాలు అంటున్నాయి. పరిశ్రమలో అనుసరించాల్సిన (ఎస్​డబ్ల్యూఎల్) సేఫ్టీ వర్క్ లోడ్ సిస్టం అమలు కావడం లేదని కార్మిక వర్గాలు ఆరోపిస్తున్నాయి.

Security vulnerabilities in HSL Visakha
విశాఖ హిందూస్థాన్ షిప్ యార్డ్​
author img

By

Published : Aug 2, 2020, 4:32 PM IST

విశాఖ హిందుస్థాన్ షిప్ యార్డ్​

హిందుస్థాన్ షిప్​యార్డ్​లో 1975 నుంచి ఉన్న క్రేన్లను పదికిపైగా ఇప్పటికీ వినియోగించడం ఆందోళన కలిగిస్తోంది. భద్రతా పరంగా చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. యాజమాన్యం దీనిపై దృష్టి పెట్టడం లేదని కార్మికులు వాపోతున్నారు. ఏ విభాగంలో క్రేన్ ఎంత లోడ్ ఎత్తాలి అనేది స్పష్టంగా నిర్దేశించాలి. ఎన్ని డిగ్రీల కోణంలో ఎంత బరువు ఏ మేరకు లేపాలి, ఎటువైపు కదలాలి అనేది కూడా ప్రమాణాల మేరకు ఉండాలి. క్రేన్ సకాలంలో నవీకరణ జరుగుతోందా..? లైసెన్స్ నవీకరణ చేస్తున్నారా లేదా అన్నది నిత్యం పర్యవేక్షించాలి. ఈ ప్రమాణాలు పాటించారా లేదా అన్న అంశంపైన హిందుస్థాన్ షిప్​యార్డ్ యాజమాన్యం ఇంతవరకు ఎటువంటి వివరణ ఇవ్వకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

వాస్తవంగా ఈ ప్రమాదానికి గురైన ఈ భారీ క్రేన్​ దశాబ్దం క్రితం కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. అప్పటినుంచి దీన్ని వినియోగంలోకి తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు. అవాంతరాలు ఎదురవుతున్నాయి. 2020లో దీనిని కమిషన్ చేయడానికి గ్రీన్ ఫీల్డ్ కార్పొరేషన్​తో షిప్​యార్డ్ యాజమాన్యం ఒప్పందం చేసుకుంది. గత రెండు రోజులుగా టెస్టింగ్ జరుగుతోంది. 70 టన్నుల సామర్థ్యం గల 100 అడుగుల ఎత్తు ఉన్న ఈ క్రేన్... లోడ్ టెస్టింగ్ జరుగుతున్న సమయంలో ప్రమాదం జరిగింది. ప్రమాదం పొంచి ఉందని చెబుతూనే ఉన్నామని ఉద్యోగులు, కార్మికులు అంటున్నారు.

ఇదీ చదవండీ... పనిచేసే చోటే కబళించిన మృత్యువు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.