విశాఖలో 3 రోజుల పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మకాం వేశారు. భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా... నిర్వహించిన లాంగ్ మార్చ్ని విజయవంతం చేశారంటూ పార్టీ శ్రేణులను ప్రత్యేకంగా అభినందించారు. కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు అన్ని ప్రాంతాల్లోనూ టెంట్లు వేసి అందోళన చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన అభ్యర్థులతో పవన్ భేటీ అయ్యారు. పార్టీ సంస్థాగత నిర్మాణానికి చర్యలు చేపడతామని వివరించారు. వైకాపా నేతలు, మంత్రులతో పాటు ముఖ్యమంత్రిపైనా ఘాటు విమర్శలు చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను గుర్తించినపుడు... విమర్శించడంలో స్వరం పెంచాలని ప్రార్టీ శ్రేణులకు సూచించారు.
తాను పోటీచేసిన గాజువాక నియోజకవర్గ కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశమైన పవన్ కళ్యాణ్... వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపారు. ఓడిపోయినందుకు ఎక్కడా సిగ్గుపడనవసరం లేదని... ప్రజాసమస్యలపై నిరంతర పోరాటం చేయాలన్నదే పార్టీ లక్ష్యమని ఉద్ఘాటించారు. పార్టీ సంస్థాగత నిర్మాణానికి అవసరమైన విధి విధానాలు ఖరారు చేస్తున్నామని వివరించారు. పార్టీ నియమావళిని అందరూ పాటించాలని... అందుకు అనుగుణంగా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి