విశాఖ పరవాడ రాంకీ ఫార్మాసిటీలో జరిగిన అగ్నిప్రమాదంలో ఓ ఉద్యోగి మృతి చెందాడు. సాల్వెంట్స్ ఫార్మా కంపెనీలో రాత్రి విధుల్లోకి వెళ్లిన కాండ్రేగుల శ్రీనివాస్(40) ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. శ్రీనివాస్ పరిశ్రమలో సీనియర్ కెమిస్ట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. రాత్రి విధుల్లోకి వెళ్లిన శ్రీనివాస్ ఆచూకీ లభించలేదు.
ప్రమాద స్థలి వద్ద పూర్తిగా కాలి ఉన్న మృతదేహం వీడియో బయటకు రావటంతో ఉద్యోగి మృతి విషయం వెలుగుచూసింది. అయితే అధికారికంగా దీనిని ఎవరూ ధ్రవీకరించలేదు. ఈ ఘటనలో మరో ఉద్యోగి మల్లేశ్వరరావు గాజువాక ఆర్కే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమించటంతో విశాఖలో ఓ కార్పోరేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రమాద సమయంలో కంపెనీలో నలుగురు సిబ్బంది ఉన్నారు.
ఇదీ చూడండి..