కొవిడ్ బాధితులకు సహాయం అందించేందుకు ప్రతి జిల్లాలో 104 కాల్ సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కొవిడ్ ఆస్పత్రులు, కేర్ సెంటర్లు, పడకలు, అంబులెన్స్‌ల వివరాల కోసం ఈ కాల్ సెంటర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. కానీ క్షేత్రస్థాయిలో కాల్‌సెంటర్ల పనితీరు ఆశించినంత మెరుగ్గా ఉండటంలేదు. వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి విశాఖ కేజీహెచ్ ఆసుపత్రిని పరిశీలించారు. ఆ సమయంలో కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన 104 కాల్ సెంటర్‌కు ఫోన్ చేయగా.. కనెక్ట్ కాలేదు. దాదాపు 20 నిమిషాలు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.
దీంతో ఆయన విజయవాడ కేంద్రంగా 104 కాల్సెంటర్లను పర్యవేక్షిస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారికి ఫోన్ చేసి పరిస్థితిని వివరించారు. సర్వర్‌లో తలెత్తిన తాత్కలిక సాంకేతిక లోపం వల్ల కాల్స్ ఆలస్యమవుతున్నాయని అధికారి వివరణ ఇచ్చారు. సమస్యను వెంటనే సరిదిద్దాలని విజయసాయి అధికారులను ఆదేశించారు.
ఇదీచదవండి