విశాఖ మధురవాడలో మియావకి విధానంలో 3,400 మొక్కలను నాటి ప్రజలు హరిత స్ఫూర్తిని చాటారు. జీవీఎంసీ ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో రెవెన్యూ కాలనీ రెసిడెన్షియల్ వెల్ఫేర్ సంఘం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. 28 రకాల మొక్కలను కాలనీ ప్రజలంతా కలిసి నాటారు. ఈ కార్యక్రమంలో పిల్లలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు పెంచడం ద్వారా నగరాల్లో చిట్టడవుల సృష్టించేందుకు మియావకి పద్ధతి దోహదం చేస్తుందన్నారు. విశాఖలో పెద్ద ఎత్తున మియావకి విధానాన్ని ప్రోత్సహించే దిశగా జీవీఎంసీ ప్రణాళిక సిద్ధం చేసినట్లు స్థానికులు తెలిపారు. పచ్చదనాన్ని పెంపొందించే దిశగా ప్రజలు ముందుకు రావటం పట్ల జీవీఎంసీ కమిషనర్ సృజన హర్షం వ్యక్తం చేశారు. మరిన్ని కాలనీలకు చెందిన ప్రజలు ఈ తరహా కార్యక్రమాలను చేపట్టాలని.. అందుకు జీవీఎంసీ పూర్తి స్థాయిలో సహకరిస్తుందని కమిషనర్ వెల్లడించారు.
ఇవీ చూడండి...