అర్హత ఉన్న ఏ ఒక్కరి పింఛను తొలగించమని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. విశాఖలో మాట్లాడిన ఆయన... పింఛన్ల జాబితా నుంచి పేర్లు తొలగిపోయిన వారు రీ వెరిఫికేషన్ ఫాంతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈనెల 15 వరకు తుది గడువు ఉందని తెలిపారు. తెదేపా ప్రభుత్వం హయంలో ఇష్టానుసారంగా అనర్హులకు పింఛన్లు ఇచ్చారని... అలాంటి వాటిని గుర్తించి జాబితాల నుంచి పేర్లు తొలగించామని చెప్పారు.
మంచిపేరు వస్తుందనే విమర్శలు...
ల్యాండ్పూలింగ్పై విపక్షాలు చేస్తున్న విమర్శలు సరికావని మంత్రి అవంతి అన్నారు. ఉచిత ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంపై విషపూరిత ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. భూములు ఇచ్చే రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఉగాది రోజున రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేయబోతున్నామని పేర్కొన్నారు. ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను పారదర్శకంగా చేపడుతున్నామని అన్నారు.
ఇదీ చదవండి: