ETV Bharat / city

హార్వార్డ్​ విశ్వవిద్యాలయాన్ని తలదన్నేలా విశాఖ ఐఐఎం - విశాఖ ఐఐఎం తాజా వార్తలు

ప్రపంచ ప్రసిద్ధ విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా ఉన్న హార్వార్డ్‌ విశ్వవిద్యాలయాన్ని తలదన్నేలా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలతో విశాఖ నగర శివారులోని గంభీరంలో ఐ.ఐ.ఎం. నూతన ప్రాంగణాన్ని నిర్మించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. టాటా గ్రూపు సంస్థ అయిన షాపూర్‌జి పన్లోన్‌జి సంస్థకు నిర్మాణ బాధ్యతలు అప్పగించారు.

విశాఖలో  హార్వార్డ్‌ విశ్వవిద్యాలయ వసతుల్ని తలదన్నేలా...

author img

By

Published : Nov 21, 2020, 10:28 AM IST

విశాఖ ఐఐఎం నూతన ప్రాంగణాన్ని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తీర్చిదిద్దాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. గంభీరంలో రూపుదిద్దుకుంటున్న ఈ కట్టడం... రాష్ట్రానికే తలమానికంగా నిలుస్తుందని అభిప్రాయపడుతున్నారు. దీని నిర్మాణ బాధ్యతలను షాపూర్‌జి పన్లోన్‌జి సంస్థ చేపట్టింది. 241.50 ఎకరాల్లో అత్యంత సుందరమైన ప్రాంగణాన్ని అభివృద్ధి చేసేందుకు అధికారులు ఇప్పటికే విస్తృత కసరత్తు చేశారు. భవనాల్లో సదుపాయాలకు సంబంధించిన 1800 డ్రాయింగ్స్‌ను ఇప్పటికే సిద్ధం చేశారు. ఆయా డ్రాయింగ్స్‌కు అనుగుణంగా నూతన ప్రాంగణాన్ని నిర్మిస్తారు. దిల్లీకి చెందిన ‘ఆర్‌కాప్‌’ అనే సంస్థ డిజైన్లు రూపొందించింది. ఐ.ఐ.ఎం.లో ఉండే వసతుల ఆధునికతను గురించి తెలుసుకుంటే ఎవరైనా ఆశ్యర్యపోవాల్సిందే..

రెండు దశలకు రూ.807.69కోట్ల వ్యయం....

మొదటిదశలో 600 మంది విద్యార్థులకు సరిపడా వసతులు రూ.392.48కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. మొదటిదశ పూర్తైతే 60,384 చదరపు మీటర్ల విస్తీర్ణం అందుబాటులోకి వస్తుంది.

రెండోదశ పూర్తైన తరువాత మొత్తం 1,15,800 చదరపు మీటర్ల సువిశాల విస్తీర్ణంలో భవనాలు, తరగతి గదులు, ఇతర వసతులు అందుబాటులో ఉంటాయి. మొత్తం 1170 మందికి విద్యాబోధన చేయడానికి అవసరమైన సమగ్ర సదుపాయాలు కల్పిస్తారు. రెండు దశల నిర్మాణాలు పూర్తయ్యేసరికి రూ.807.69కోట్లు ఖర్చవుతుందని అంచనా.

ఐదు నక్షత్రాల హోటల్‌ను తలపించేలా వసతిగృహాలు..

విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సదుపాయాలను అందుబాటులో ఉంచుతారు. విద్యార్థుల వసతిగృహాల్లోని ప్రతి గదిలోనూ ఏసీ, టీవీ, ఫ్రిజ్, ఒవెన్, కెటిల్, వాషింగ్‌ మిషన్‌ తదితరాలన్నీ అందుబాటులో ఉంటాయి. ఐదునక్షత్రాల హోటల్‌ వసతులకు దీటుగా వసతిగృహాలు నిర్మిస్తారు.

60 గదులతో అతిథిగృహం...

ఐ.ఐ.ఎం. విద్యార్థులకు బోధించడానికి దేశవిదేశాల నుంచి ప్రముఖులు తరచూ వస్తుంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని వారు బస చేయడానికి వీలుగా 60 గదులతో అతిథిగృహాన్ని నిర్మిస్తారు.

ఆధునికతకు చిరునామాగా తరగతి గదులు..

తరగతి గదులను ఆధునికతకు చిరునామాలా తీర్చిదిద్దనున్నారు. ఇందుకోసం హార్వార్డ్‌ విశ్వవిద్యాలయ మోడల్‌ను ఆదర్శంగా తీసుకుని అంతకు మించిన ఆధునికత ఉట్టిపడేలా డిజైన్లు రూపొందించారు. విద్యార్థులు 'యూ' ఆకారంలో కూర్చొంటారు. 50 మంది, వంద మంది విద్యార్థులు కూర్చొనేలా శీతలీకరణ తరగతి గదులుంటాయి. ఆచార్యులు పాఠం చెప్పడం మొదలుపెడితే సెన్సర్లు గ్రహించి స్పీకర్లు వాటంతటవే పనిచేస్తాయి. విద్యార్థులు మాట్లాడితే వారి మాటలు కూడా సెన్సర్లు గ్రహించి స్పీకర్లలో వినిపిస్తాయి. దీంతోపాటు మాట్లాడుతున్న విద్యార్థి ఫొటో అందరికీ కనిపించేలా బోర్డ్‌పై దానంతటదే ప్రత్యక్షమవుతుంది. అత్యాధునిక డిజిటల్‌ వ్యవస్థలన్నీ ఆయా తరగతి గదుల్లో ఉంటాయి.

వంద సీట్ల తరగతి గదులు-10, 50 సీట్ల తరగతి గదులు-10, అదనపు తరగతి గదులు 5 అందుబాటులో ఉంటాయి. తరగతి గదుల్లో చెప్పే పాఠాలన్నీ రికార్డవుతాయి. 15 రోజులపాటు వాటిని విద్యార్థులకు అందుబాటులో ఉంచుతారు. ఫలితంగా ఆయా పాఠ్యాంశాలను విద్యార్థులు ఎన్నిసార్లైనా వినవచ్చు. ఆచార్యులకు 117 కార్యాలయాలను ప్రత్యేకంగా తీర్చిదిద్దుతారు.

1500 కిలోవాట్ల సౌర విద్యుత్తు ప్లాంటు..

సంస్థ విద్యుత్తు అవసరాలకు కావాల్సిన దానికన్నా అధికంగా విద్యుత్తును ఉత్పత్తి చేసేలా 1500 కిలోవాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్తు ప్లాంటు నిర్మిస్తారు. సంవత్సరానికి 22.59లక్షల యూనిట్లు ఉత్పత్తి చేయడం ప్లాంటు లక్ష్యంగా నిర్ణయించారు.

వందశాతం నీటి పునర్వినియోగ వ్యవస్థ..

నూతన ప్రాంగణంలో వినియోగించే ప్రతి నీటిబొట్టును పునర్వినియోగం చేసేలా శుద్ధి చేస్తారు. అందుకోసం ‘వాటర్‌ రీసైక్లింగ్‌ ప్లాంటు’ నిర్మిస్తారు. వినియోగమయ్యే నీటిని శుద్ధి చేసి మొక్కలకు పోస్తారు. దీంతోపాటు ప్రాంగణంలో భూగర్భ జలాలకు ఎలాంటి సమస్య లేకుండా పెద్ద చెరువు అభివృద్ధి చేస్తారు.

కాలుష్య నివారణకు 7,200మొక్కలు..

ఐ.ఐ.ఎం. ప్రాంగణంలో ఉద్యోగులు, సిబ్బంది పూర్తిస్థాయిలో అత్యంత స్వచ్ఛమైన గాలిని పీల్చేలా 7,200 వృక్ష, ఫల, పూల జాతిమొక్కలు నాటతారు. ఏటా సుమారు 1920 టన్నులకు సమానమైన బొగ్గుపులుసు వాయువును ఆయా మొక్కలు పీల్చుకునేలా అత్యంత శాస్త్రీయమైన విశ్లేషణలతో కనీసం నాటాల్సిన మొక్కల సంఖ్యను ఖరారు చేయడం గమనార్హం. ఆయా మొక్కలన్నీ ఉద్యానవనాల్ని తలదన్నేలా ఒక క్రమపద్ధతిలో అభివృద్ధి చేస్తారు.

గ్రిహ ఫైవ్‌స్టార్‌ రేటింగ్‌ ప్రమాణాలకు అనుగుణంగా...

పర్యావరణానికి అత్యంత అనుకూలమైన నిర్మాణాలకు ‘గ్రిహ ఫైవ్‌స్టార్‌’ రేటింగ్‌ ఇస్తుంటారు. ఆ ప్రమాణాలకు అనుగుణంగా పచ్చదనం అభివృద్ధి చేస్తారు. అదనపు కర్బన ఉద్గారాలు లేకుండా, పూర్తిస్థాయి నీటి యాజమాన్య పద్ధతులతో, స్వచ్ఛమైన సౌరవిద్యుత్తుతో పూర్తిస్థాయి ఆదర్శవంతమైన ప్రాంగణాన్ని అభివృద్ధి చేస్తారు.

కొవిడ్‌ నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు...

కొవిడ్‌ అనుభవాల్ని దృష్టిలో ఉంచుకుని కొన్ని అదనపు ఏర్పాట్లు చేస్తున్నారు. అత్యధిక ఉపకరణాలను వినియోగించడానికి చేతులతో మీటలు నొక్కే పరిస్థితి లేకుండా సెన్సర్ల ఆధారంగా పనిచేసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుండడం విశేషం.

అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా తీర్చిదిద్దుతున్నాం...

విశాఖపట్నం ప్రపంచంలోని అత్యుత్తమ విద్యార్థులకు దీటుగా విశాఖ ఐ.ఐ.ఎం.ను తీర్చిదిద్దుతున్నాం. ఇందుకోసం దేశంలోని పలు ప్రముఖ విద్యాసంస్థలను సందర్శించి వాటికన్నా మెరుగైన డిజైన్లను ఖరారు చేశాం. దేశంలోని అత్యంత సుందరమైన ఐ.ఐ.ఎం.గా కూడా విశాఖ ఐ.ఐ.ఎం. గుర్తింపు పొందుతుంది.

ఎం.చంద్రశేఖర్, సంచాలకుడు, ఐ.ఐ.ఎం

ఇదీ చదవండి: తుంగభద్ర పుష్కరాలు మొదలైనా.. పూర్తికాని పనులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.