విశాఖలోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం వేదికగా ఈనెల 31 నుంచి రెండు రోజులపాటు జాతీయ స్థాయి యువజనోత్సవాలు నిర్వహించనున్నారు. యువతలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసే ఉద్దేశంతో గత 20 ఏళ్లుగా 'జెమ్' పేరిట యువజనోత్సవాలు నిర్వహిస్తున్నారు. విద్యార్థులు వివిధ కమిటీలుగా ఏర్పడి ఈ ఉత్సవాలు నిర్వహిస్తారని జెమ్ సీఈవో విహార్ వర్మ తెలిపారు. 150 కళాశాలల నుంచి సుమారు 15 వేల మంది విద్యార్థులు ఈ ఉత్సవాల్లో పాల్గొననున్నారు.
ఇదీ చదవండి :